సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది.

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె కన్నడతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటించింది. కన్నడంలో ఏరేండ్ల తూ, ఏటీఎం, జాక్‌పాట్, అపార్ట్‌మెంట్ టు మర్డర్, వందన వంటి సినిమాల్లో. నటించింది. బ్రహ్మగతంతు, నినిదలే తదితర టీవీ సీరియల్స్‌లో నటించింది. తెలుగులోనూ పలు సీరియల్స్ చేస్తున్నది. శోభిత రెండేళ్ల కిందట పెళ్లి చేసుకొని స్థిరపడింది. ఆదివారం గచ్చిబౌలిలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
కర్ణాటక హాసన్‌లోని సకలేశ్‌పూర్ కు చెందిన శోభిత అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బెంగళూరు కు వెళ్ళింది.. శోభిత 12పైగా కన్నడ సీరియల్స్‌లో నటించింది. చిదపాట, మంగళగౌరి, కోగిలే, బ్రహ్మగంతు, కృష్ణ రుక్మిణి, మణెదేవ తదితర సీరియల్స్ ఆమెకు మంచి పేరు తెచ్చాయి. కన్నడలోనే రెండు మూడు సినిమాల్లో నటించింది. విద్యార్ధిని గా ఉన్నప్పుడే సినిమాలు, టీవీరంగంపై ఆసక్తి పెంచుకుంది. డ్యాన్స్ కూడా నేర్చుకుంది. మొదట యాంకర్‌గా పని చేసింది. ఆ తర్వాత సీరియల్స్ కువెళ్ళింది. అక్కడి నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టింది. శోభిత(Shobitha) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్‌లో ఉంటుంది. భర్త హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన తర్వాత సినిమాలు, టీవీకి దూరమైంది. సోషల్ మీడియాలో చివరిసారిగా కన్నడ రాజ్యోత్సవం, దీపావళి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత బెంగళూరుకు భౌతిక దేహాన్ని తీసుకెళతారు.
