ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. ఏ వయసువారైనా ప్రేమలో పడవచ్చు. ఇదే విషయాన్ని స్టార్‌ హీరో టామ్‌ క్రూజ్‌(Tom Cruise) మరోసారి ప్రూవ్‌ చేశాడు. ఆ హాలీవుడ్‌ హీరో షష్టిపూర్తి చేసుకుని ఏడాది అయ్యింది. ఈ వయసులోనూ యువకుడిలాగే ఉంటాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు బోల్డంత మంది అభిమానులున్నారు. చూడగానే ఆకట్టుకునే రూపం కాబట్టే అమ్మాయిలు ఇతగాడికి చటుక్కుమని పడిపోతారు. ఇప్పటికే మూడుసార్లు ప్రేమలో నిండా మునిగిన టామ్‌ క్రూజ్‌ నాలుగోసారి ప్రేమలో పడ్డాడు.

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. ఏ వయసువారైనా ప్రేమలో పడవచ్చు. ఇదే విషయాన్ని స్టార్‌ హీరో టామ్‌ క్రూజ్‌(Tom Cruise) మరోసారి ప్రూవ్‌ చేశాడు. ఆ హాలీవుడ్‌ హీరో షష్టిపూర్తి చేసుకుని ఏడాది అయ్యింది. ఈ వయసులోనూ యువకుడిలాగే ఉంటాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు బోల్డంత మంది అభిమానులున్నారు. చూడగానే ఆకట్టుకునే రూపం కాబట్టే అమ్మాయిలు ఇతగాడికి చటుక్కుమని పడిపోతారు. ఇప్పటికే మూడుసార్లు ప్రేమలో నిండా మునిగిన టామ్‌ క్రూజ్‌ నాలుగోసారి ప్రేమలో పడ్డాడు. అది కూడా 36 ఏళ్ల అమ్మాయితో. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. రెండు నెలల కిందటే ఈ ప్రేమ వ్యవహారం బయటకు వచ్చినా ఇప్పుడే సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. రష్యాకు చెందిన ప్రముఖ మోడల్‌ ఎల్సినా ఖైరోవా(Elsina Khairova)- టామ్‌ క్రూజ్‌లు గాఢంగా ప్రేమించుకుంటున్నారని వినికిడి. ఎంత ఘాటు ప్రేమయో, ఇంత లేటు వయసులో అంటూ సాంగేసుకుంటున్నారట! గత ఏడాది డిసెంబర్‌లో లండన్‌లోని మే ఫెయిర్‌లో వీరిద్దరు కలిసి పార్టీలో పాల్గొన్నారు.

ఇద్దరి మధ్యన సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందని అప్పట్నుంచే మీడియాలో కథనాలు రావడం మొదలయ్యింది. ఇటీవల లండన్‌లోని ఎయిర్‌ అంబులెన్స్‌ ఛారిటీకి మద్దతు ఇచ్చే చారిటీ డిన్నర్‌లో కూడా కలిసే పాల్గొన్నారు. ఇక లండన్‌లోని స్పెషల్‌ రెస్టారెంట్లలో తరచూ ఈ జంట కనిపిస్తూ ఉంటుంది. ఎల్సినా ఇంటి దగ్గర ఉన్న హైడ్‌ పార్కలో అయితే చేతిలో చేయి వేసుకుని చక్కర్లు కొడుతుంటారు. ఎలాగూ తమ ప్రేమ విషయం పది మందికి తెలిసిపోయింది కాబట్టి తమ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకూడదని టామ్‌ క్రూజ్‌ అనుకుంటున్నాడు. తాను ఎల్సినా ఖైరోవాతో కలిసి దిగిన ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అన్నట్టు టామ్‌ క్రూజ్‌, ఎల్సినా కలిసే ఉంటున్నారట! ఇప్పటికే మూడు సార్లు పెళ్లిచేసుకున్న టామ్‌ క్రూజ్‌ నాలుగో పెళ్లికి కూడా రెడీ అవుతున్నాడన్నమాట! ఆ మూడు పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. 1987లో మిమీ రోజర్స్‌ను వివాహం చేసుకున్నాడు టామ్‌ క్రూజ్‌.
1987 లో మిమీ రోజర్స్‌ ని వివాహం చేసుకున్న టామ్ క్రూజ్ ముచ్చటగా మూడేళ్లు ఆమెతో కాపురం చేశాడంతే. 1990లో రోజర్స్‌కు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత నికోల్‌ కిడ్‌మాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో 2001 వరకు కలిసే వున్నాడు. తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు. అయిదేళ్లు ఒంటరిగా ఉన్న టామ్‌ క్రూజ్‌ 2006లో కేటీహోమ్స్‌తో సంబంధం పెట్టుకున్నాడు. ఆరేళ్లకు ఆమె కూడా మొహమొత్తింది. 2012లో ఆమెతో రిలేషన్‌ను కట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఎల్సినా ఖైరోవాతో రిలేషన్‌ పెట్టుకున్నాడు.

Updated On 15 Feb 2024 7:06 AM GMT
Ehatv

Ehatv

Next Story