సినీ ఇండస్ట్రీలో మెున్నటి వరకు టాప్‌ ప్లేసులో వినిపించే ముద్దుగుమ్మలు రష్మిక మంధన,పూజా హెగ్డే,సమంత,రకుల్ ప్రీత్‌సింగ్ వీరిపేర్లు మాత్రమే స్టార్ హీరో సినిమాల్లో తరుచుగా వినిపించేవి...... రష్మిక కు ఆఫర్స్ వస్తున్న వదులుకుని మరీ టాలీవుడ్ కు దూరంగా ఉంటూ తన ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే పెడతుంది.సమంత చైతూతో విడాకులు తీసుకున్న తరువాత చాలా తక్కువగా సినిమాలు చేస్తుంది.ఇక పూజా హెగ్డే నటన మీద ఆసక్తి ఉన్నా ఆఫర్లు వస్తున్న ఎక్కువగా సినిమాలు చేయదు........వీరి తరువాత […]

సినీ ఇండస్ట్రీలో మెున్నటి వరకు టాప్‌ ప్లేసులో వినిపించే ముద్దుగుమ్మలు రష్మిక మంధన,పూజా హెగ్డే,సమంత,రకుల్ ప్రీత్‌సింగ్ వీరిపేర్లు మాత్రమే స్టార్ హీరో సినిమాల్లో
తరుచుగా వినిపించేవి...... రష్మిక కు ఆఫర్స్ వస్తున్న వదులుకుని మరీ టాలీవుడ్ కు దూరంగా ఉంటూ తన ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే పెడతుంది.సమంత చైతూతో
విడాకులు తీసుకున్న తరువాత చాలా తక్కువగా సినిమాలు చేస్తుంది.ఇక పూజా హెగ్డే నటన మీద ఆసక్తి ఉన్నా ఆఫర్లు వస్తున్న ఎక్కువగా సినిమాలు చేయదు........వీరి తరువాత
ఈ మధ్య కాలంలో కొంతమంది కధానాయకులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.అందులో ఓ ఇద్దరు హీరోయిన్లకు మాత్రం బాగా కలిసొచ్చింది.

తెలుగు సినీపరిశ్రమలో దర్శక నిర్మాతలు స్టార్‌హీరోల పక్కన ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్‌లతో సినిమాలు చేయాలని ఆశిస్తు్ంటారు. కాలం మారుతున్న కొద్దీ
ఇండస్టీలోకి కొత్త కధానాయికలు ఎంట్రీ ఇస్తుంటారు.కానీ వచ్చిన వారు అందరు నిలదొక్కుకోవడం కష్టమే.కొంతమంది ఒక్క సినిమాతోనే కనబడకుండా పోతారు.
మరికొంతమందికి అదృష్టం కలిసి వచ్చి మొదటి సినిమాతోనే ఫుల్‌గా పాపులారిటీ సంపాదించుకుంటారు.వారితోనే హీరోలు రిపీటెడ్‌గా సినీమాలు చేస్తూనే ఉంటారు.
ఒకవేళ హీరోయిన్ల డేట్స్ దొరకకపోయిన వెయిట్ చేసి మరీ వారితోనే సినిమాలు చేస్తారు .అయితే ప్రస్తుతం వరుస ‍‎ఛాన్స్‌లతో బిజీగా దూసుకుపోతున్న ముద్దు గుమ్మలు మృణాలిని ఠాకూర్, శ్రీలీల
వీరిద్దరు తమ అందంతో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు.

క్యూట్‌బ్యూటీ శ్రీలీల దర్శకేంద్రుడు రాఘువేంద్రరావు పెళ్లి సందడి మూవీతో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టి మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు.ఇటీవలే ధమాకా సినిమాతో బ్లాక్‌బస్లర్
అందుకొనిమంచి స్వింగ్‌లో ఉన్నారు.డబుల్‌ధమాకాను ఎంజాయి చేస్తున్న ఈ భామ టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా,క్యూట్ బ్యూటీగా మారిపోయింది. ఈ భామకు డిమాండ్ ఒక్కసారిగా
పెరిగిపోయింది .ఈ సినిమా సక్సెస్‌తో మరోక్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పేసారు.ధమాకా సినిమాకు 30 లక్షల పారితోషికం తీసుకున్న ఈ అమ్మడు తన పారితోషికం ఏకంగా కోటికి పెంచేసిందట. అంతేకాకుండా ఈ అమ్మడు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది.ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాజాడీలక్స్‌లో ఒక హీరోయి‌న్‌గా
ఈమెనే తీసుకుంటున్నట్లు సమాచారం.

సీతారామమ్ సినిమాలో ఒక్కసారిగా తన అందచందాలకు ప్రేక్షకులు ఫిధా అయిపోయారు.అంతేకాకుండా ఒక సరికొత్త ఆర్మీ ప్రేమ కధతో దుల్కర్‌సల్మాన్ రామ్‌గా సీతగా మృణాలిని తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ప్రేమకధలకు టాలీవుడ్‌లో ఇంకా జీవం ఉందని నిరూపించింది. అంతేకాకుండా
సీత పాత్రతో మృణాలిని తనదైన ముద్ర వేసుకుంది.దీంతో యువత తనకు అభిమానులుగా మారిపోయారు.ఈ సినిమా తరువాత మృణాలినికి వరుసగా ఆఫర్లు క్యూకట్టాయి.దీంతో ఈ అమ్మడు నానితో తన రెండో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.అంతేకాదు ఈ అమ్మడుకు ఏకంగా ఎన్టీఆర్ పక్కనే నటించే ‍‎ఛాన్స్‌ కూడా వచ్చి్ందట.
మరి వీరు తమ ధమాకతో ప్రేక్షకులను ఎప్పటివరకు మెప్పిస్తారో వీరి హంగామా ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.

Updated On 7 Feb 2023 8:32 AM GMT
Ehatv

Ehatv

Next Story