టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్స్ అయిదు లేదా ఆరు హిట్లు కొట్టి, ఒక స్టార్ డాం వచ్చిన తర్వాతే తమ రెమ్యూనరేషన్ ను పెంచేవారు..కానీ ఇపుడు ఆ ట్రెండ్ లేదు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్స్ మాత్రం రెమ్యూనరేషన్ లో తగ్గేది లేదు అంటున్నారు.. ఒకప్పుడు అనుష్క శెట్టి , తమన్నా, ఇలియానా, నయనతార, సమంత లాంటి హీరోయిన్స్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడానికి చాలా టైం పట్టేది. కానీ ఇపుడు అలా కాదు.. […]

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్స్ అయిదు లేదా ఆరు హిట్లు కొట్టి, ఒక స్టార్ డాం వచ్చిన తర్వాతే తమ రెమ్యూనరేషన్ ను పెంచేవారు..కానీ ఇపుడు ఆ ట్రెండ్ లేదు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్స్ మాత్రం రెమ్యూనరేషన్ లో తగ్గేది లేదు అంటున్నారు.. ఒకప్పుడు అనుష్క శెట్టి , తమన్నా, ఇలియానా, నయనతార, సమంత లాంటి హీరోయిన్స్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడానికి చాలా టైం పట్టేది. కానీ ఇపుడు అలా కాదు.. హీరోయిన్ ది ఒక్క సినిమా హిట్ అయితే చాలు కోట్లు ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ కూడా క్యూ కడుతున్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. కెరీర్‌లో మొదట్లోనే మంచి హిట్ అందుకున్న ఈ భామ.. గతేడాది చివర్లో రవితేజతో చేసిన ‘ధమాకా’ మూవీతో ధమాకా లాంటి విజయాన్ని సొంతం చేసుకొని టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారింది. పెళ్లి సందడితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పెళ్లిసందడి మూవీకి ఓన్లీ 6 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంది. శ్రీలీల హీరోయిన్ గా చేసిన మరో మూవీ ధమాకా. ఈ మూవీ సక్సెస్‌తో ఈ భామ ఒక్కసారిగా తన పారితోషకం కోటికి పెంచినట్టు సమాచారం. ధమాకా సినిమాకు రూ. 30 లక్షల వరకు డిమాండ్ చేసిన ఈ బ్యూటీ ఇపుడు ఏకంగా రూ. కోటి వరకు తన రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది.

మరో హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. అంటే మనోల్లకు తెలియకపోవచ్చు.. కానీ సీతారామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన లేటెస్ట్ సినిమా సీతారామం. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అయితే సీతారామంకి 20 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ అమ్మడు..ఈ మూవీ హిట్ అవ్వడంతో ప్రస్తుతం కోటిన్నర తీసుకుంటుంది.

కృతి శెట్టి "ఉప్పెన" ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగులో రెండో సినిమా నాని హీరోగా నటించిన "శ్యామ్‌ సింగరాయ్‌"‌, మూడవ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన 'బంగార్రాజు' లో నటించింది. ఉప్పెన సినిమాకు చాలా తక్కువ పారితోషికం తీసుకుంది. ఉప్పెన, శ్యామ్‌ సింగరాయ్‌, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్స్‌ అందుకున్న ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌ను ఓ రేంజ్‌లో పెంచేసింది. ఇప్పటిదాకా తెలుగు సినిమాలకు దాదాపు కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకున్న ఉప్పెన బ్యూటీ, సూర్య చిత్రానికి మాత్రం ఏకంగా రూ.1.5 కోట్లు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత అనే చెప్పుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకొవాలి అంటారు కదా ..అందుకేనేమో కొత్తగా వస్తున్న హీరోయిన్స్ ఒక్క హిట్ తోనే కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు.

Updated On 9 Feb 2023 2:13 AM GMT
Ehatv

Ehatv

Next Story