టాలీవుడ్‌ సింగర్‌ అనురాగ్‌ కులకర్ణి(Anurag kulakarni), సహ సింగర్‌ రమ్య బెహరాను(Ramya behara) వివాహం(Marriage) చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్‌ సింగర్‌ అనురాగ్‌ కులకర్ణి(Anurag kulakarni), సహ సింగర్‌ రమ్య బెహరాను(Ramya behara) వివాహం(Marriage) చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటో ఒకటి వైరల్‌గా(Viral photo) మారింది. అనురాగ్ కులకర్ణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐడియా సూపర్ సింగర్(Super singer) సీజన్ 8లో విజేతగా నిలిచారు. దాని తర్వాత సినిమా పాటలు పాడుతూ బిజీబిజీ అయిపోయాడు. RX100 సినిమాలో 'పిల్లారా సాంగ్'తో అనురాగ్‌ కులకర్ణికి మంచి పేరు వచ్చింది. దీంతో పాటు అవార్డులను కూడా అందుకునేలా చేసింది. శ్యామ్ సింగరాయ్‌లో ప్రణవాలయ సాంగ్‌తో పాటల ప్రేమికులకు మరింత దగ్గరయ్యాడు. కులకర్ణి పెళ్లాడిన మరో సింగర్‌ రమ్య బెహరా కూడా ఎన్నో మంచి పాటలను పాడి మెప్పించింది. వీరిద్దరిది ప్రేమ వివాహామని తెలుస్తోంది. రమ్య బెహరా సూపర్ సింగర్ 4లో పాల్గొంది. రమ్యను టాలీవుడ్‌కు కీరవాణి పరిచయం చేశారు. టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, కొత్తజంట, చిన్నదాన నీకోసం, దిక్కులు చూడకు రామయ్య, ఇస్మార్ట్ శంకర్, రెడ్, రంగ్ దే, శతమానం భవతి లాంటి సినిమాల్లో రమ్య పాడిన పాటలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీరి పెళ్లి ఫొటో వైరల్‌గా మారడంతో వీరిద్దరి ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరేమో ఇది నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరు అధికారికంగా ప్రకటిస్తేనే పెళ్లిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Eha Tv

Eha Tv

Next Story