సింగర్ సునీత ( Sunitha) రామ్ వీరపనేని (మ్యాన్ గో రామ్) రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రామ్ కుటుంబ సభ్యుల సమక్షంలో సింగర్ సునీత పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లయిన మొదలు నుంచి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే తాజాగా తనకు థ్రెట్ ఉందని సునీత భర్త రామ్ వీరపనేని (Ram Veerapaneni) పోలీసులను ఆశ్రయించారు.

సింగర్ సునీత ( Sunitha) రామ్ వీరపనేని (మ్యాన్ గో రామ్) రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రామ్ కుటుంబ సభ్యుల సమక్షంలో సింగర్ సునీత పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లయిన మొదలు నుంచి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే తాజాగా తనకు థ్రెట్ ఉందని సునీత భర్త రామ్ వీరపనేని (Ram Veerapaneni) పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులను ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో నివాసం ఉంటున్న ఆయనకు గత కొద్దిరోజులుగా థ్రెట్ కాల్స్ వస్తున్నాయని.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ అంటూ ఓ వ్యక్తి తనను పర్సనల్‏గా కలవాలని ఇబ్బందిపెడుతూ మెస్సెజ్‏లు పెడుతున్నారట.

అయితే ఆ నంబర్‏ని బ్లాక్ చేయడంతో కొత్త నెంబర్ నుంచి మెస్సెజ్‏లు వస్తున్నాయని పోలీసులకు చెప్పారు. వరుస మెస్సెజ్‏లతో వేధిస్తున్నాడని కంప్లైట్‏లో పేర్కొన్నాడు. రామ్ వీరపనేని ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక సునీత తన పాటలతో మ్యూజిక్ లవర్స్ మనసు దోచుకుంది సింగర్ సునీత. పాటలు, డబ్బింగ్ ఇలా ప్రతీ దాంతో ఆడియన్స్‏కు దగ్గరైంది సునీత. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ (TFI)లో పాపులర్ సింగర్‏గా పేరుతో సంపాదించడంతోపాటు భారీ ఫాలోయింగ్‏ను క్రియేట్ చేసుకుంది సునీత. లైఫ్‏లో ఎన్నో సమస్యలు తనను వెంటాడినప్పటి అన్నిటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నానని సింగర్ సునీత (Sunitha) పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పింది. మ్యాన్ గో రామ్ ను పెళ్లిచేసుకున్న తర్వాత ఆమెపై చాలానే ట్రోలింగ్స్ ఒచ్చాయి. రెండో పెళ్లిని సునీత చాలా లైట్ గా తీసుకుంది. ట్రోలర్స్ కు గట్టి కౌంటర్లు ఇచ్చి.. వాళ్ల నోళ్లు మూయించింది సునీత.

Updated On 24 April 2023 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story