టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై(Jani master) లైంగిక వేధింపుల(Sexual harrasment case) కేసుపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ రియాక్టయ్యింది.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై(Jani master) లైంగిక వేధింపుల(Sexual harrasment case) కేసుపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ రియాక్టయ్యింది. మీడియా సమావేశంలో బాధితురాలి మద్దతుగా నిలుస్తామని చెప్పింది. ప్రెస్‌మీట్ తమ్మారెడ్డి భరద్వాజ్(Thammareddy Bharadwaj), ఝాన్సీతో(Jhansi) పాటు ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. మీడియా ప్రశ్నలకు జవాబులిచ్చారు. 'బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించింది. మీడియా ఈ ఘటనను మా దృష్టికి తీసుకొచ్చింది. పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై లీగల్‌గా విచారణ జరుగుతోంది. వేధింపులు ఎదుర్కొన్న సమయంలో ఆ అమ్మాయి మైనర్(Minor). ఆమెకు న్యాయ సహాయం అవసరం. ఇద్దరి తరఫున వాదనలు విన్నాం.
90 రోజల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం. మా పరిధిలో మేము విచారణ పూర్తి చేశాం. అమ్మాయిలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వారి వివరాలు మేం గోప్యంగా ఉంచుతాం. అందుకే ఈ అమ్మాయి వివరాలను కూడా బయటకు చెప్పకూడదని నిర్ణయించుకున్నాం' అని ఝాన్సీ చెప్పారు. 'సంగీత, ప్రేమ, ప్రగతితో పాటు మరికొందరు వాయిస్ ఆఫ్ విమెన్‌లో భాగం. ఇటీవల సమంత దీని గురించే పోస్ట్ పెట్టారు. వాయిస్ ఆఫ్ విమెన్ సినీ పరిశ్రమకు సంబంధించిందే తప్ప వేరేది కాదు. ప్రభుత్వంతో చాంబర్ చర్చలు కొనసాగిస్తూనే ఉంది. ఎప్పుడైతే పెద్దవాళ్లు మాట్లాడతారో అప్పుడే దాని గురించి చర్చ జరుగుతుంటుంది. మా దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉంది. కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపాం. రెండు ఫేక్ కంప్లైట్స్ కూడా వచ్చాయి. పలువురు మహిళలు మిస్ యూజ్ కూడా చేస్తారనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఫేక్ కంప్లైట్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికీ ప్రత్యేక సెక్షన్ ఉంది. కమిటీలకు సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి. జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన అమ్మాయి విషయానికి వస్తే , పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదుర్కోవడమే కాదు వేరే ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. లీగల్‌గా, మెడికల్‌గా, పోలీసుల సాయం తీసుకోవడానికి ఒకవేళ ఆ అమ్మాయికి తగిన ధైర్యం లేకపోతే కమిటీ హెల్ప్ చేయగలగాలి. ఆ క్రమంలోనే భూమిక హెల్ప్‌లైన్ అనే ఎన్జీవో సపోర్ట్‌గా నిలిచింది’అని చెప్పుకొచ్చారు ఝాన్సీ.
అవకాశాలు పోతాయనే భయంతో చాలా మంది తమకు ఎదురైన పరిస్థితులను చెప్పడం లేదని, ప్రతిభ ఉన్న వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడూ లభిస్తాయని అన్నారు.
ఇలాంటి కేసుల కోసమే 2013లో ఆసరా అని పెట్టామని చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ్. 2018లో ప్యానల్ పెట్టామని, ఇలాంటివి ఎన్ని తీసుకొచ్చినా మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. ఇండస్ట్రీలో మహిళలు సేఫ్‌గా ఉంటారని తెలియజేయడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామని చెప్పారు. 90 రోజుల్లో దీనికి పరిష్కారం ఆలోచిస్తామని, ఇందుకు మీడియా సహకారం కూడా కావాలని తెలిపారు.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు, ఎదుర్కొంటున్నవారు తమకు ఫిర్యాదు చేయాలని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. హైదరాబాద్‌లోని టీఎఫ్‌సీసీ ఆఫీసు దగ్గర ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంప్లైట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్ హైదరాబాద్- 500 096 చిరునామాకు పోస్ట్ ద్వారా అయినా ఫిర్యాదు చేయొచ్చని వివరించింది. ఫోన్ నంబరు: 98499 72280, మెయిల్ ఐడీ: [email protected] ద్వారా కంప్లయింట్ ఇవ్వొచ్చని పేర్కొంది.