ఒకప్పటి కథానాయకుడు చంద్రమోహన్(Chandrabamohan) కాసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉదయం 9.45 నిమిషాలకు గుండెపోటుతో ఆయన చనిపోయారు. ఆయన వయసు 82 ఏళ్లు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయి.

Actor Chandra Mohan Passed Away
ఒకప్పటి కథానాయకుడు చంద్రమోహన్(Chandrabamohan) కాసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉదయం 9.45 నిమిషాలకు గుండెపోటుతో ఆయన చనిపోయారు. ఆయన వయసు 82 ఏళ్లు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. బిఎన్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రంగులరాట్నం సినిమాతో ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అచిరకాలంలోనే హీరో అయ్యారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలరు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరావు. ప్రధానంగా హాస్యరస పాత్రలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. హీరోగా 175 చిత్రాలకు పైగా నటించారు. మొత్తం ఆయన 932 సినిమాల్లో నటించారు. కొత్త హీరోయిన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను చెబుతుంటారు. సిరిసిరిమువ్వలో ఆయన పక్కన నటించిన జయప్రద టాప్ హీరోయిన్‌గా మారారు. అలాగే పదహారేళ్ల వయసులో చంద్రమోహన్ సరసన నటించిన శ్రీదేవి అగ్రశేణి కథానాయిక అయ్యారు. వాణిశ్రీ,జయసుధ, కవిత, ఫటాఫట్ జయలక్ష్మి, ప్రభ, విజయశాంతి, తాళ్లూరు రామేశ్వరి, తాళ్లూరి కృష్ణకుమారి .. ఇలా చాలా మంది తొలుత చంద్రమోహన్‌తో నటించినవారే! బొమ్మాబొరుసా, జీవనతరంగాలు, ఓసీత కథ, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, పదహారేళ్ల వయసు, శంకరాభరణం, శుభోదయం, మనిషికో చరిత్ర, రాధాకల్యాణం ఆయనకు మంచి పేరు తెచ్చాయి.
