ఎర్ర జెండా మీద సినిమాలు తీసి వాటితో హిట్‌ను పాకెట్లో వేసుకోవచ్చని నిరూపించిన నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి(R.Narayana Murthy). ప్రజల్లో చైతన్యం తెచ్చెలా సినిమాలు తీయడంలో ఆయనకు మించినవాళ్లెవరూ లేరని చెప్పాలి. అందుకేనేమో ఆయనను పీపుల్స్ స్టార్ అంటారు. ఆర్. నారాయణ మూర్తి తీసిన చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. అయితే ఆర్.నారాయణ మూర్తి (R.Narayana Murthy) గురించి దర్శకుడు, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. సినిమాపై […]
ఎర్ర జెండా మీద సినిమాలు తీసి వాటితో హిట్‌ను పాకెట్లో వేసుకోవచ్చని నిరూపించిన నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి(R.Narayana Murthy). ప్రజల్లో చైతన్యం తెచ్చెలా సినిమాలు తీయడంలో ఆయనకు మించినవాళ్లెవరూ లేరని చెప్పాలి. అందుకేనేమో ఆయనను పీపుల్స్ స్టార్ అంటారు. ఆర్. నారాయణ మూర్తి తీసిన చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. అయితే ఆర్.నారాయణ మూర్తి (R.Narayana Murthy) గురించి దర్శకుడు, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. సినిమాపై ఫుల్ క్లారిటీ ఉన్న ఆయనకు.. ఇన్ని సినిమాలు తీసినా.. అన్ని హిట్లు కొట్టినా.. ఇప్పటి ఆర్. నారాయణ మూర్తికి సొంత ఇల్లు కూడా లేదు. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకన వెళ్తుంటారు.. దారి మధ్యలో ఆయన కనిపిస్తే.. అభిమానంతో ఆయనకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు. ఇదే ఆర్.నారాయణ మూర్తి (R.Narayana Murthy) సింప్లిసిటీ. ఆయన ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నారు.
అయితే తాజాగా దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే.. ఆర్. నారాయణ మూర్తి ఒక విప్లవ శక్తి. తెలుగు సినిమాకు ఒక డిఫరెంట్ స్టేటస్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన అని అన్నారు. ఆలోచింప జేసి, ఆలోచనలు మార్పించి.. విప్లవాన్ని నమ్ముకొని విప్లవం కోసమే జీవితాన్ని అంకితం చేశాడన్నాడు. ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ అయినా కూడా తర్వాత ఆశయం కోసం.. తను నమ్మిన సినిమాలు తీశాడని తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) తెలిపారు. ఆయన పంథా మార్చుకుని సినిమాలు చేస్తే ఎన్నో కోట్ల రూపాయలు పంపాదించేవాడు.. కానీ ఎప్పుడూ ఆయన అలా చేయలేదన్నారు. మీ సిద్ధాంతం వదలకుండా సినిమాలు చేసే విధానం మార్చుకోండని నేను చాలా సార్లు చెప్పానని.. కానీ ఆయన మాత్రం వినిపించుకోలేదన్నారు. విప్లవ పంథా సినిమాలు తీయడం వల్లే ఆయన ఇంకా అలానే ఉండిపోయారన్నారు. ఎన్నో హిట్స్ ఇచ్చినా.. ఎంతో సంపాదించినా.. ఇప్పటికి రోడ్డుమీద నచుకుంటూ లేదా ఆటోలో తిరుగుతున్నాడని.. ఆయన గొప్పతనం మరెవ్వరికీ రాదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.