నిర్మాత నట్టి కుమార్‌(Natty Kumar) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆస్కార్‌(Oscar) గ్రహీతల సన్మాన కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర నిర్మాత(RRR Producer) డీవీవీ దానయ్య(DVV Danayya) లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్‌ అందుకున్న వారిని అంత అర్జెంట్‌గా , ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొన్న జరిగిన అకాడమీ అవార్డు(Academy Awards) కార్యక్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాట(Natu Natu Song)కు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌

నిర్మాత నట్టి కుమార్‌(Natty Kumar) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆస్కార్‌(Oscar) గ్రహీతల సన్మాన కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర నిర్మాత(RRR Producer) డీవీవీ దానయ్య(DVV Danayya) లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్‌ అందుకున్న వారిని అంత అర్జెంట్‌గా , ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొన్న జరిగిన అకాడమీ అవార్డు(Academy Awards) కార్యక్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాట(Natu Natu Song)కు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా! ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్‌ అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌లను సన్మానించారు. ఈ అభినందన కార్యక్రమంపై నిర్మాత నట్టికుమార్‌ నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను చెప్పారు. ఆయన వ్యాఖ్యల్లో కొంత ఘాటు కూడా ఉంది.

'తెలుగు సినిమాకు ఆస్కార్‌ రావడం గర్వించదగ్గ విషయం. కాకపోతే ఆస్కార్‌ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు. అభినందన సభకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలు రాలేదు. ఒక్క సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం వచ్చారంతే! అసలు ఈ ప్రొగ్రామ్‌ కోసం ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలతో ఎందుకు మాట్లాడలేదు? ఆస్కార్‌ గ్రహీతలకు అంత అర్జెంటుగా ఎందుకు సన్మానం చేయాల్సి వచ్చింది? అసలు ఈ ఈవెంట్‌ గురించి చాలా మందికి సమాచారమే లేదు. ఇదేం పద్దతి' అంటూ మండిపడ్డారు నట్టి కుమార్‌. 'ఈసీ అప్రూవల్‌ లేకుండా ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నుంచి 25 లక్షల రూపాయలను తీసి ఎలా ఖర్చు చేస్తారు? తెలంగాణ వచ్చాక పరిశ్రమకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కానీ తెలంగాణలో చిన్న సినిమాలకు ఏమీ చేయడం లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు వస్తుంది. చిన్న సినిమాలకు అయిదో షో కావాలని అడుగుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. తెలంగాణలో ఎక్కువ లాభాలు వస్తున్నాయని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అంటున్నారు కానీ తెలంగాణలో 32 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 68 శాతం లాభాలు వస్తున్నాయి. అయినా చాలా కంపెనీలు తెలంగాణలోనే జీఎస్టీ కడుతున్నాయి. సినిమా పరిశ్రమలో ఆంధ్ర, తెలంగాణ అన్న బేధాలు లేవు. అందరం కలిసికట్టుగానే ఉన్నాం' అని నట్టికుమార్‌ అన్నారు.

Updated On 10 April 2023 5:57 AM GMT
Ehatv

Ehatv

Next Story