ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో రాజకీయ ప్రవేశంపై దిల్‌రాజే స్వయంగా మాట్లాడారు. ఇండస్ట్రీలో తనను ఎవరైనా చిన్న మాట అంటేనే తట్టుకోలేనని
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు(Producer Dil Raju) రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో రాజకీయ ప్రవేశంపై దిల్‌రాజే స్వయంగా మాట్లాడారు. ఇండస్ట్రీ(Industry)లో తనను ఎవరైనా చిన్న మాట అంటేనే తట్టుకోలేనని, అలాంటిది రాజకీయాలలో అనేక అడ్డంకులు ఉంటాయని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తానా లేదా అన్నది అప్రస్తుతమంటూ దిల్‌రాజు(Dil Raju) అన్నారు. పాలిటిక్స్‌లో వస్తానని కానీ, రానని కానీ చెప్పకుండా ప్రజల ఊహకే ఆ విషయాన్ని వదిలిపెట్టారు.
మొన్నామధ్య తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. అప్పుడు దిల్‌రాజు తను నిర్మించిన ఆలయానికి రేవంత్‌ను తీసుకెళ్లారు. అప్పుడే చాలా మంది చెవులుకొరుక్కున్నారు. దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న చర్చ మొదలయ్యింది. నిజామాబాద్(Nizamabad) రూరల్ నియోజకవర్గానికి రేవంత్‌రెడ్డి వచ్చినప్పుడు మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లి(Narsingpally)లో వేంకటేశ్వరస్వామి(Venkateshwara swamy) ఆలయానికి దిల్‌రాజు తీసుకెళ్లారు. ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ ఆలయాన్ని దిల్‌రాజే నిర్మించారు. అయితే అటు బలగం సినిమా సమయంలో మంత్రులు కేటీఆర్(KTR), గంగుల కమలాకర్(Gangula Kamalakar)తోనూ దిల్‌రాజు చనువుగా ఉన్నారు దిల్‌రాజు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను(BRS) కాదని.. దిల్ రాజు కాంగ్రెస్(Congress) వైపు ఎందుకు చూస్తారని కొందరు అంటున్నారు..