దిల్ రాజు నిర్మాతగా మరోసారి తన మార్కును ప్రూవ్ చేసుకున్నారు. తన టేస్ట్‌కి, జడ్జిమెంట్‌కి తిరుగులేదని కేకేసి మరీ చెప్పారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తనదైన ముద్రతో, కమిట్‌మెంట్‌తో నిర్మాణానికి పూనుకుని, అన్నీ తానై సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళి హిట్ మీద హిట్ కొట్టిన దిల్ రాజు ఇంకోసారి బలాదూర్ అనిపించుకున్నారు.
దిల్ రాజు నిర్మాతగా మరోసారి తన మార్కును ప్రూవ్ చేసుకున్నారు. తన టేస్ట్‌కి, జడ్జిమెంట్‌కి తిరుగులేదని కేకేసి మరీ చెప్పారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తనదైన ముద్రతో, కమిట్‌మెంట్‌తో నిర్మాణానికి పూనుకుని, అన్నీ తానై సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళి హిట్ మీద హిట్ కొట్టిన దిల్ రాజు ఇంకోసారి బలాదూర్ అనిపించుకున్నారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. బలగం సినిమాని ఏ నిర్మాత ప్రోత్సహించరు. ఖర్చులు వెచ్చాలు బేరీజు వేసుకున్న తర్వాత మనకెందుకురా బాబూ అని వెనుకడుగే వేస్తారు. ఇదేమంత విచిత్రం కానే కాదు. ప్రతీ రూపాయిని పదిమంది చేత లెక్కపెట్టించి, అందుకు గానూ సిబ్బందికి లక్షలు ఖర్చు పెట్టే ఈ కమర్షియల్ ప్రపంచంలో బలంగ చిత్రకథని ఎవరైనా ప్రోత్సహిస్తారా? ఛస్తే హించరు.
కానీ, కేవలం డబ్బు ఖర్చు చూసుకునే నిర్మాతే అయితే దిల్ రాజుకి ఇంత పేరుప్రతిష్టలు లభించవు. సుప్రసిద్ద పంపిణీదారుడు, ప్రముఖ ఫైనాన్షియర్ నారాయణదాసు నారంగ్ బతికున్నకాలంలో ఓ ఇంటర్య్వూలో చెబుతూ, కథను విని, ప్యూర్ జడ్డిమెంట్ వేల్యూస్‌మీదనే ఆధారపడి చిత్రనిర్మాణం చేస్తారు కాబట్టే దిల్ రాజు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వగలుగుతున్నారు అని అభిప్రాయపడ్డారు. దాదాపు దిల్‌రాజు గురించి, ఆయన టేస్ట్ గురించి తెలిసిన వారంతా ఈ నిజాన్ని ఒప్పుకుని తీరుతారు. అందుకు తాజా నిదర్శనమే బలగం సినిమా నిర్మాణం. యువ దర్శకుడు, కామెడీకి పేరుపడిన జబర్దస్ట్ వేణు సిన్సియర్‌గా తయారుచేసుకుని తెచ్చిన కథని ఆద్యంతం విని, ఓపికగా ఆర్ధం చేసకుని చిత్రనిర్మాణానికి పూనుకున్నారే...దట్స్ గ్రేట్, అదీ ఆయన గ్రేట్‌నెస్. సినాప్సిస్‌లు పంపించమని, టీం వింటారని చెప్పడం అదో పెద్ద ట్రెండ్ మన తెలుగు సినిమా పరిశ్రమలో. అరగంటలో చెప్తావా....టూకీగా చెప్పొచ్చుగా అని అర్ధాకలితో వచ్చే యువ దర్శక రచయితలకు చుక్కలు చూపించి, గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వని ఓ దుష్ట సంప్రదాయం కోరలు సాచిందీ మధ్యన.
అలా బలైపోతున్న వారెందరో. వీలైతే చెవిలో అనుకోకుండా పడ్డదేదైనా ఒకటో రెండో పాయంట్లు బావుంటే వాటిని తస్కరించి తమ కథలను తయారు చేసుకునే గ్యాంగ్ కూడా తయారైంది ఇటీవల. వాళ్ళందరికీ నిజాయితీగా, సినిమా అనే కళమీద అత్యంత ప్రేమానురక్తితో యువదర్శకుల వెన్నుతట్టే దిల్‌రాజు ఓ ఆదర్శం. నిర్మాత ఎలా ఉండాలో అందరికీ అందుబాటులో ఉండే నిఖార్సయిన నిదర్శనం. ఈ మధ్య రోజులలో దిల్‌రాజుని విమర్శించేవాళ్ళు ఎక్కువయ్యారు పరిశ్రమలో, ఆయనలోని ఆత్మవిశ్వాసం అందరికీ అహంకారంలా కనిపిస్తోంది. ఈ విషయం దిల్ రాజు దృష్టికి వచ్చినా ఆయనేమీ పెద్ద శ్రమ పడడం లేదు దానిని సరిదిద్దుకోవడానికి. బలంగం లాటి సినిమాలు తీస్తూంటే ఆ తీరిక కూడా చిక్కడం లేదు ఆయనకి. ఓ పక్కన హెవీ బడ్జెట్‌తో రామ్ చరణ్, శంకర్ కాంబోలో భారీ చిత్రం నిర్మిస్తూ కూడా తర్వాత చూద్దాంలే అనుకోకుండా ఓ నవ యువ దర్శకుడి జీవితాన్ని పండించారు దిల్ రాజు. ఇదే ఆయన సంతకం. బలగం లాటి చిత్రాలే ఆయన బలం. దానికి తోడు ఆయన బ్రదర్ శిరీష్, వాళ్ళ చిల్డ్రన్ కూడా రంగంలోకి దిగారు....యువప్రతిభకు ఇదే వరం