డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే కొంతమేరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే గత వారంలో రామ్ చరణ్ ఫ్యామిలీ వెకేషన్ కోసం దుబాయ్(Dubai) వెళ్లారు. అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు మెగాపవర్ స్టార్. ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు చెప్పారు నిర్మాత దిల్ రాజు (Dil Raju).

బాలీవుడ్, తమిళ్ సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ గురించి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. టాలీవుడ్లో అగ్రనిర్మాతగా ఇటీవలే దిల్ రాజు 20ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. సౌత్ సినిమాలపై ఇంపాక్ట్ చూపిన ప్రొడ్యూర్స్, అండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టులు, బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బలగం (Balagam) సినిమా గురించి మాట్లాడారు. దిల్ రాజు కూతురు హన్హితారెడ్డి, అల్లుడు హర్షిత్‌రెడ్డి నిర్మించిన సినిమాయే బలగం(Balagam).
ఈ సినిమా పల్లెటూరి ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన కథ. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జనాలకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా ఓటీటీ (OTT)లో విడుదల అయినప్పటికీ ఇంకా థియేటర్లలో షోలు పడుతూనే ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత జీవితంలో ఏం మిస్సాయ్యామనే విషయాన్ని గ్రహించి ఆడియన్స్ ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఈ సినిమా తర్వాత జనాల నుంచి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ ఎమోషన్ ఈ సినిమాకు మేజర్ సక్సెస్ అని శాకుంతలం (Shaakuntalam) ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలిపారు.
తెలుగు ఇండస్ట్రీలో 20ఏళ్ల ప్రయాణం సక్సెస్ ఫుల్‌గా మొదలైందని, తెలుగులో ఇప్పటికి 50 సినిమాలు నిర్మించాని.. నెక్ట్స్ టార్గెట్ తమిళం, హిందీలో సినిమాలు తీయాలన్నారు. ఈ 20ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, ఇక సినిమా సక్సెస్ అవ్వన్నప్పుడు.. ఎక్కడ తప్పుజరిగిందో చెక్ చేసుకుంటానని ఆయన చెప్పారు. చాలా హోమ్ వర్క్ చేసినప్పుడు తప్పులు రిపీట్ అవ్వకుండా ఉంటాయని దిల్ రాజు (Dil Raju) చెప్పారు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) చిత్రం గురించి మాట్లాడుతూ.. శంకర్ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడా అని చూస్తున్నానని.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు టైమ్ పడుతుందని ఆయన చెప్పారు. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదలచేస్తున్నామని ప్రకటించారు ఆయన.