సుప్రసిద్ధ నిర్మాత, చలనచిత్ర నిర్మాణ రంగంలో గోల్డెన్‌ హ్యండ్‌గా కీర్తి ప్రతిష్టలు సాధించిన దిల్‌రాజు రాజకీయాలలోకి ప్రవేశిస్తారని, రాజకీయాలలోకి రమ్మని ఆయన పైన తీవ్రమైన ఒత్తిడి ఉందని ఎప్పటికప్పుడు వార్తలు పస్తూనే ఉన్నాయి. వాటిని దిల్‌రాజు సమాధానం చెప్పకుండా సున్నితంగా తప్పించుకుంటూనే వస్తున్నారు. కానీ బలగం సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియామీట్‌లో ఎప్పటిలాగే దిల్‌రాజు రాజకీయరంగ ప్రవేశం గురించి ప్రస్తావన వచ్చింది.

సుప్రసిద్ధ నిర్మాత, చలనచిత్ర నిర్మాణ రంగంలో గోల్డెన్‌ హ్యండ్‌గా కీర్తి ప్రతిష్టలు సాధించిన దిల్‌రాజు రాజకీయాలలోకి ప్రవేశిస్తారని, రాజకీయాలలోకి రమ్మని ఆయన పైన తీవ్రమైన ఒత్తిడి ఉందని ఎప్పటికప్పుడు వార్తలు పస్తూనే ఉన్నాయి. వాటిని దిల్‌రాజు సమాధానం చెప్పకుండా సున్నితంగా తప్పించుకుంటూనే వస్తున్నారు. కానీ బలగం సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియామీట్‌లో ఎప్పటిలాగే దిల్‌రాజు రాజకీయరంగ ప్రవేశం గురించి ప్రస్తావన వచ్చింది. ఈసారి మట్టుకు దిల్‌రాజు స్పందించారు. తనకూ రాజకీయాలకు సరిపడదని, రాజకీయాలలోకి రావడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టం చేశారు. అయితే రమ్మని ఆహ్వానాలు మాత్రం ముమ్మరంగా ఉన్నాయన్నారు. ‘’ సినిమా పరిశ్రమలోనే ఎవ్వరైనా ఏ చిన్నమాటన్నా నేను తట్టుకోలేను. ఎందుకంటే నేను ఏది చేసినా నిజాయితీగా చేస్తాను. త్రికరణశుద్ధిగా నా ప్రోగ్రాంని అనుసరిస్తాను. కానీ, అనేవాళ్ళు ఏదో ఒక మాట అనడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. రాజకీయాలలో దీని మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. అవతలవాళ్ళు ఒకటంటే, మనమొకటి అంటుండాలి. ఈ వ్యవహరం నాకు సూటు కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే రాజకీయాలకు నేను సరిపడను’’అని దిల్‌రాజు నవ్వుతూ చెప్పారు.

దిల్‌రాజు నిజంగానే రాజకీయాలకు పనికిరారా?

సినిమా ప్రపంచంలో ఉన్నవాళ్ళు, విజయాల పరంగా ఒక ఉన్నతస్థానానికి చేరుకున్నవాళ్ళలో ఉండే ప్రధానమైన ఆంశం....సృజనాత్మక శక్తి. కళాత్మక దృష్టి. రాజకీయాలలో సృజనాత్మకతకో, కళాత్మక దృక్ఫథానికో ఏ మాత్రం తావులేని స్థితే అంతటా కనబడుతుది. కళను నమ్ముకునే తత్వం సినిమావాళ్ళది అయితే, అస్సలు కళ ప్రమేయం లేకుండా కేవలం రాజకీయాలను మాత్రమే ఆశ్రయించి పరిభ్రమించే ప్రపంచం రాజకీయరంగం. దిల్‌రాజు క్రియాశీలక జీవితంలోకి అడుగుపెట్టి రేపటికి సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తవుతాయి. ఈ రెండు దశాబ్దాలలో ఆయన అనుక్షణం కథలు విని, వాటిలో మంచి చెడ్డలను బేరీజు వేసుకుంటూ, కేవలం తన జడ్డిమెంట్ మీద ఆధారపడి, బడ్జెట్‌ల పరంగా రిస్క్ చేసి సినిమాలు నిర్మిస్తూ, విజయాలను చేజిక్కించుకుంటూ ఇంత వరకూ అలుపు అన్నది లేకుండా ప్రయాణిస్తున్నారు.

సినిమా....సినిమా....సినిమా....ఇదే దిల్‌రాజు జీవితం దానాదీనా. ఇన్నాళ్ళలో ఎప్పుడూ దిల్‌రాజు రాజకీయ రంగప్రవేశం పట్ల ఆసక్తిని కనబరిచిన దాఖలాలు ఎక్కడా లేవు. నిజామాబాద్‌లో దిల్‌రాజు ఒక దేవాలయం నిర్మించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి అక్కడికి పార్టీ ప్రచార నిమిత్తం వెళ్ళినప్పుడు మర్యాదకి దిల్‌రాజు ఆయన్ని ఆహ్వానించారు. అది జరిగినప్పుడు కాంగ్రెస్‌కి దిల్‌రాజుకి పెళ్ళి చేసేసింది మీడియా. మరి బలగం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగినప్పుడు రాష్ట్ర మంత్రి, సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనయుడైన కేటీఆర్‌ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు దిల్‌రాజు. అలాగని తెలంగాణ సంస్కృతి ఆధారంగా తీస్తున్న సినిమా కాబట్టి పన్ను మినహాయింపు గురించి కూడా దిల్‌రాజు ప్రభుత్వం ముందు చెయ్యి సాచలేదు. రాజకీయాలలోకి రావడం కోసం ఎవరి పంచనా చేరవలసిన అగత్యం దిల్‌రాజుకైతే ఏ కోశాన లేదు.

పైగా దిల్‌రాజు వ్యక్తిగతంగా చాలా సున్నితస్వభావి. నొప్పించక, తానొవ్వక తన కార్యకలాపాలను ఆచితూచి వ్యవహరిస్తూ ఇన్ని విజయాలను ఆయన సాధించుకుటూ వస్తున్నారు. సృజనాత్మక ప్రపంచంలో మనుగడ సాగించేవారి కళాత్మక హృదయం రాజకీయరంగంలో కనబడదు. ఎందుకంటే అది నిరంతర సంగ్రామం. ఎవరు ఎక్కడ, ఎలా గల్లంతైపోతారో తెలియదు. రాత్రికి రాత్రే ఆచూకి లేకుండా కనుమరుగైపోతారు. ఏ అడుగైనా, ఏ పాచికైనా ఎదుటివారిని,ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి మాత్రమే. విమర్శలు, ప్రతి విమర్శలు తారస్థాయిలో సాగుతుంటాయి. కొన్ని వేళల్లో ఉచ్ఛంనీచం మరచిపోయి కూడా మాట్లాడవలసి వస్తుంది. అటువంటి మాటలు కూడా పడవలసి వస్తుంది. రాజకీయాలలో ఎవరూ గొప్పకాదు. పదవి ఉన్నంతకాలమే ఏ వెలుగైనా. సినిమాలలో ఇప్పుడు దిల్‌రాజు హఠాత్తుగా విరమించుకున్నా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేంతగా ఆయన తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు.

ఇప్పటికే దిల్‌రాజు...ఇటు చిత్రనిర్మాణం, పాన్‌ ఇండియా చిత్రాలు, బలగం వంటి సంచలన విజయాలు, విస్తృతమైన పంపిణీ వ్యవస్థ, వందలాది ధియేటర్లను హేండిల్‌ చేస్తున్నారు. కృషితో, దీక్షతో, అంకితభావంతో, నిజాయితీగా ఇంత సుదీర్ఘకాలం చలనచిత్రరంగంలో సాధించిన ఈ ప్రతిష్టనీ, ఈ ప్రాభవాన్ని రాజకీయాలలోకి వెళ్ళి గంగలో కలుపుతారని ఎవ్వరూ అనుకోరు. ఏ కారణం చేతనైనా వెళ్ళే పరిస్థితే గనక వస్తే గిస్తే...దానికి కూడా చాలా నిగూఢమైన, నిర్దిష్టమైన ప్రమాణాలేవో ఉంటాయే తప్ప, రాజకీయాల ద్వారా ఎంతో కొంత లబ్ది పొందాలని, అర్రులు సాచే అయోమయ పరిస్థితి మాత్రం దిల్‌రాజుకి లేనేలేదు. పిల్లల చేతికి సినిమా బెజినెస్‌ని అప్పజెప్పి తాను రాజకీయాలలకో వస్తారనే ఓ లెక్క ఒకటి గాలిలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా పూర్తిగా నిరాధారం. కారణం ఏంటంటే.....బలగం సినిమాకి పూనుకున్న హర్షిత్‌ రెడ్డి, అంషితా రెడ్డి ఇంకా ముక్కుపచ్చలారని పిల్లలు. దిల్‌రాజు కార్యకలాపాలను వారి హస్తగతం కావడం మాట పక్కన బెడితే అసలు దిల్‌రాజు నిర్మించిన సామ్రాజ్యం వారికి అర్ధం కావడానికే ఎంతో కాలం పడుతుంది. వారు పూర్తిగా ఈ వ్యవహరాలకు అలవాటు పడాలి. పదును తేలాలి. అప్పుడు కదా. అంటే దానికి దిల్‌రాజు నిర్ణయించుకున్న కాలపరిమితి ఐదేళ్ళు కావచ్చు. ఎన్ని అవకాశాలు ఉన్నా, వచ్చినా అక్కినేని నాగేశ్వరరావు ఏనాడు రాజకీయాల జోలికి పోలేదు. దానికెంతో వివేచన కావాలి. అ వివేచన దిల్‌రాజులో కూడా మెండుగా, నిండుగా ఉంది. ఆవేశంతో రాజకీయాలలోకి ప్రవేశించి, చరిత్రనైతే సృష్టించగలిగారు గానీ తీవ్రమైన వ్యక్తిగత అప్రతిష్టను మూట గట్టుకున్నారు నందమూరి తారకరామారావు. అన్ని ఉదాహరణలు దిల్‌రాజు ముందే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితులలో గనక రాజకీయాలలోకి రావడమే గనక జరిగితే అక్కడ నెగ్గుకు రాగలిగే లౌక్యం కూడా దిల్‌రాజులో పుష్కలంగా ఉందన్నది సత్యం.

" Written By : Nagendra Kumar "

Updated On 5 April 2023 2:34 AM GMT
Ehatv

Ehatv

Next Story