ఒకప్పుడంటే ఏమో అనుకోవచ్చు కానీ ఈ రోజుల్లో ఓ మూడు గంటల పాటు థియేటర్‌లో కూర్చొని సినిమా చూడటం కష్టమే! సినిమా బాగుంటే ఓకే.. బాగోలేకపోతేనే ముళ్ల మీద కూర్చున్న ఫీలింగ్‌ కలుగుతుంది. నాలుగేళ్ల కిందట బంగ్లాదేశ్‌లో ఓ బెంగాలీ సినిమా వచ్చింది. సినిమా పేరు అమ్రా ఎక్తా సినిమా బనాబో(Amra Ekta Cinema Banabo). తెలుగులో చెప్పాలంటే మేము కూడా సినిమా తీస్తాం అని అర్థం! ఈ సినిమా డ్యూరేషన్‌ ఎంతనుకుంటున్నారు? 1,265 నిమిషాలు.. అంటే 21 గంటలా అయిదు నిమిషాలు.. ఓ మై గాడ్‌ అని గుండెలు బాదుకుంటున్నారా? అంతేసి నిడివి ఉన్న సినిమాను కూడా చూసిన ప్రేక్షకులు ఉన్నారు. పూర్తిగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీసిన ఆ సినిమా ఓ ప్రయోగమనే చెప్పుకోవాలి. దీని తర్వాతి స్థానం రెసన్‌(Reson) అనే ఇంగ్లీష్‌ సినిమాది! ఈ సినిమా నిడివి 873 నిమిషాలు.. గంటల్లో చెప్పుకోవాలంటే 14 గంటలా 33 నిమిషాలు..

పాతాళభైరవి(Pathala Bhairavi) నుంచి ఆదిపురుష్‌(adhipurush) వరకు డ్యూరేషన్‌ ఎక్కువున్న సినిమాలు ఇవే!

ఒకప్పుడంటే ఏమో అనుకోవచ్చు కానీ ఈ రోజుల్లో ఓ మూడు గంటల పాటు థియేటర్‌లో కూర్చొని సినిమా చూడటం కష్టమే! సినిమా బాగుంటే ఓకే.. బాగోలేకపోతేనే ముళ్ల మీద కూర్చున్న ఫీలింగ్‌ కలుగుతుంది. నాలుగేళ్ల కిందట బంగ్లాదేశ్‌లో ఓ బెంగాలీ సినిమా వచ్చింది. సినిమా పేరు అమ్రా ఎక్తా సినిమా బనాబో(Amra Ekta Cinema Banabo). తెలుగులో చెప్పాలంటే మేము కూడా సినిమా తీస్తాం అని అర్థం! ఈ సినిమా డ్యూరేషన్‌ ఎంతనుకుంటున్నారు? 1,265 నిమిషాలు.. అంటే 21 గంటలా అయిదు నిమిషాలు.. ఓ మై గాడ్‌ అని గుండెలు బాదుకుంటున్నారా? అంతేసి నిడివి ఉన్న సినిమాను కూడా చూసిన ప్రేక్షకులు ఉన్నారు.

పూర్తిగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీసిన ఆ సినిమా ఓ ప్రయోగమనే చెప్పుకోవాలి. దీని తర్వాతి స్థానం రెసన్‌(Reson) అనే ఇంగ్లీష్‌ సినిమాది! ఈ సినిమా నిడివి 873 నిమిషాలు.. గంటల్లో చెప్పుకోవాలంటే 14 గంటలా 33 నిమిషాలు.. 13 గంటలు, 12 గంటలు, పది గంటలు, తొమ్మిది గంటలు నిడివి ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. అయిదు గంటల సినిమాలైతే చాలానే ఉన్నాయి.. ఇప్పుడీ సినిమాల నిడివి ప్రస్తావన ఎందుకంటే.. ఈ నెల 16వ తేదీన రాబోతున్న ఆదిపురుష్‌(Adhipurush) సినిమా సుమారు మూడు గంటల పాటు ఉంటుందట. మరి ఈ సందర్భాన ఇప్పటి వరకు అధిక రన్‌టైమ్‌తో వచ్చిన టాలీవుడ్‌ చిత్రాలను తెలుసుకోవద్దూ! రామాయణం ఆధారంగా ఆదిపురుష్‌ను తీశారు కాబట్టి ఆ మాత్రం డ్యూరేషన్‌ ఉండాలి.. కట్టె కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటే బాగోదు కదా! 1951లో విడుదలైన పాతాళ భైరవి(Pathalabhairavi) సినిమా నిడివి మూడు గంటలా 15 నిమిషాలు.. కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయా సంస్థ తీసిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌(NTR) హీరో.

అప్పట్లో ఇదే ఎక్కువ నిడివి ఉన్న సినిమా! ఈ జానపద ఫాంటసీ సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు. విజయా సంస్థ నిర్మించిన మరో సినిమా మిస్సమ్మ(Missamma). ఇది 1955లో విడుదలయ్యింది. ఎల్‌.వి.ప్రసాద్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌(NTR), ఎఎన్‌ఆర్‌(ANR), ఎస్వీఆర్‌(SVR), సావిత్రి(Savitri) వంటి మహానటులు నటించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమా డ్యూరెషన్‌ మూడు గంటలా ఒక నిమిషం. ఇది కూడా బ్రహ్మండమైన హిట్టయ్యింది. రెండేళ్ల తర్వాత అంటే 1957లో మాయాబజార్‌(Mayabazar) సినిమా వచ్చింది. విజయా బ్యానర్‌పై కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌, ఎస్వీఆర్‌, సావిత్రి, రేలంగి వంటి గొప్పగొప్ప నటులు నటించారు. ఈ సినిమా రన్‌ టైమ్‌ 3: 04 గంటలు.

ఇప్పటికీ ఈ సినిమా ఆసాంతం కదలకుండా చూడొచ్చు. అంత గొప్పగా ఉంటుందీ సినిమా.. ఈ తరంవారికి కూడా నచ్చుతుంది. 1963లో లవకుశ(Lava kusha) సినిమా వచ్చింది. తెలుగులో మొదటి రంగుల సినిమా ఇదే! లలితా శివజ్యోతి బ్యానర్‌పై శంకర్‌రెడ్డి(Shankar Reddy) తీసిన ఈ సినిమాకు సి.పుల్లయ్య(C. Pullaiah), సి.ఎస్‌.రావులు(C.S Rao) దర్శకత్వం వహించారు. రాముడిగా ఎన్టీఆర్‌, సీతగా అంజలీదేవి(Anjali Devi) నటించారు. ఈ పౌరాణిక సినిమా నిడివి మూడు గంటలా 28 నిమిషాలు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ రోజుల్లోనే కోటి రూపాయలను వసూలు చేసింది.

కమలాకర కామేశ్వరరావు(Kamalakar Kameshwar Rao) దర్శకత్వంలో ఎన్‌.టి.రామారావు, ఎస్‌.వి.రంగారావు, సావిత్రి తదితరులు నటించిన పౌరాణిక సినిమా పాండవ వనవాసం(Pandava Vanavasam) . ఇది 1965లో విడుదలై సూపర్‌హిట్టయ్యింది. ఈ సినిమా నిడివి 3: 18 గంటలు. సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన వందో సినిమా అల్లూరి సీతారామారాజు(Seetharamaraju). తెలుగులో మొదటి సినిమాస్కోప్‌ కలర్‌ సినిమా ఇది. వి.రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1974లో విడుదలయ్యింది. ఈ సినిమా నిడివి మూడు గంటలా ఏడు నిమిషాలు..ఈ సినిమా చరిత్ర సృష్టించింది. 1977లో ఎన్టీఆర్‌ శ్రీ కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా నటించి దర్శకత్వ బాధ్యతలను కూడా వహించిన సినిమా దాన వీర శూర కర్ణ. ఈ సినిమా నిడివి 3 గంటల 46 నిమిషాలు.

సాయికుమార్‌(Sai Kummar), శర్వానంద్‌(Sharwanand), సందీప్‌ కిషన్‌(Sandeep Kishan) ప్రధాన పాత్రలు పోషించిన రాజకీయ, యాక్షన్‌ సినిమా ...ప్రస్థానం(Prasthanam) .. 2010లో వచ్చిన ఈ చిత్ర నిడివి మూడు గంటల ఒక నిమిషం. వెంకటేశ్‌(Venkatesh), ఆర్తి అగర్వాల్‌(Arthi Aggarwal) హీరో హీరోయిన్లుగా కె. విజయ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం..నువ్వు నాకు నచ్చావ్‌(Nuvvu Naku Nachav). 2001లో విడుదలైన ఈ సినిమా నిడివి మూడు గంటలు. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలిచిన చిత్రం అర్జున్‌ రెడ్డి(Arjun Reddy).

సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిడివి మూడు గంటల రెండు నిమిషాలు. 2017లో ఈ సినిమా విడుదలయ్యింది. రామ్‌ చరణ్‌కు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలలో రంగస్థలం(Rangasthalam) ఒకటి. సుకుమార్‌(Sukumar) దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో వచ్చింది. ఈ సినిమా నిడివి రెండు గంటల 54 నిమిషాలు. వరుణ్‌తేజ్‌(Varun Tej) హీరోగా 2019లో వచ్చిన సినిమా గద్దలకొండ గణేశ్‌(Gadhalakonda Ganesh).. హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా నిడివి రెండు గంటల 52 నిమిషాలు.

అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప : ది రైజ్‌(Pushpa: The Rise) 2021లో విడుదలయ్యింది. అన్ని భాషల్లోనూ విజయవంతమయ్యింది. ఈ సినిమా నిడివి రెండు గంటలా 59 నిమిషాలు. రామ్‌చరణ్‌(Ram Charan), ఎన్టీఆర్‌(Jr.NTR) హీరోలుగా రాజమౌళి(Rajamouli) డైరెక్షన్‌లో లాస్టియర్‌ వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమా నిడివి మూడు గంటల రెండు నిమిషాలు. పైన పేర్కొన్న సినిమాలన్నీ విజయవంతమైనవే! డ్యూరేషన్‌ ఎక్కువైతే జనం చూడరన్నది అపప్రధ మాత్రమే. సినిమా బాగుంటే మూడు గంటలైనా చూస్తారనడానికి ఈ సినిమాలే ఉదాహరణ.

Updated On 13 Jun 2023 3:13 AM GMT
Ehatv

Ehatv

Next Story