తెలుగు సినిమా రంగం గుర్తింపు ఒక్కప్పుడు ఇద్దరి హీరో మీదనే నడించింది అంటే అతిశయోక్తి కాదు. NTR ,ANR తెలుగు ఇండస్ట్రీని వెలుగు ఇండస్ట్రీగా మార్చిన మేటి నటులు వీరు. వీరి వారసత్వం ఇప్పటికి ఇండస్ట్రీని ఏలుతుంది. వీరందరిని మరిపించేలా మెరుపులా స్వయంశక్తి తో మేటి నటనతో అశేష అభిమానులని సొంతం చేసుకున్న ఘనత మెగా ఫ్యామిలీది . మరో వైపు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా మంచి గుర్తింపుతో కొనసాగుతుంది . ఇలా తెలుగు […]
తెలుగు సినిమా రంగం గుర్తింపు ఒక్కప్పుడు ఇద్దరి హీరో మీదనే నడించింది అంటే అతిశయోక్తి కాదు. NTR ,ANR తెలుగు ఇండస్ట్రీని వెలుగు ఇండస్ట్రీగా మార్చిన మేటి నటులు వీరు. వీరి వారసత్వం ఇప్పటికి ఇండస్ట్రీని ఏలుతుంది. వీరందరిని మరిపించేలా మెరుపులా స్వయంశక్తి తో మేటి నటనతో అశేష అభిమానులని సొంతం చేసుకున్న ఘనత మెగా ఫ్యామిలీది . మరో వైపు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా మంచి గుర్తింపుతో కొనసాగుతుంది . ఇలా తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువగా వారసత్వం సందడి కనిపిస్తున్నపటికి సరైన హిట్ సినిమా పడకపోతే ఎవరినైనా పక్కన పెట్టేస్తారు ప్రేక్షకులు .
NTR ,ANR వారసుల్లో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న హీరోలు jr.ntr ,బాలయ్య ,హరికృష్ణ ,కల్యాణరామ్,తారకరత్నలు వీరిలో తారకరత్న కొన్ని సినిమాలకు మాత్రమే నటనతో మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని విభిన్న పాత్రల్లో మెరిసినప్పటికీ ఆశించినంత హిట్లు సాధించలేదు. మంచుఫ్యామిలీ విషయానికివస్తే విలక్షణ నటనలో మోహన్ బాబు నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన వారసత్వం విషయానికి వస్తే మంచు విష్ణు కెరియర్ లో 20 సినిమాలకు పైగా ఉన్న వాటిలో ఢీ సినిమా తప్ప గుర్తుపెట్టుకోవాల్సిన సినిమాలు లేవు . సొంత నిర్మాణంలో తండ్రిని పెట్టి రీసెంట్ గా తీసిన సినిమా కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు . మంచు మనోజ్ విలక్షణమైననటనతో ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న సినిమాల పరంగా హిట్ history ని create చేసుకోలేదు.
మెగా ఫ్యామిలీ లో చిరంజీవి నటన వారసత్వం తీసుకుంటూ వచ్చిన రాంచరణ్,పవన్ కళ్యాణ్,వరుణ్ తేజ్,సాయిధరమ్ తేజ్,వైష్ణవ తేజ్ లు రాగ వీళ్లల్లో కూడా సాయిధరమ్ ,వైష్ణవ,వరుణ్ లు హిట్ ఖాతాల్లో అకౌంట్ ని ఓపెన్ చేయలేకపోయారని చెప్పచు.మెగా సన్ రాంచరణ్ మాత్రం పాన్ ఇండియా స్టార్ అయ్యారు . పవన్ మోస్ట్ పాపులర్ హీరో అయ్యారు. అలాగే మెగాఫ్యామిలీకి బంధువులు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసత్వం లో అల్లు అర్జున్ కూడ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఆశించినంత గా గుర్తింపు తెచ్చుకోలేదు అని చెప్పచు .
ANR ఫామిలీ లో కూడా నాగేశ్వరావు గారు తరువాత అంత నటన గుర్తింపు కొనసాగిస్తున్న హీరో నాగార్జున ఒక్కరే అని చెప్పచు. వీళ్ల ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్,నాగ చైతన్య ,సుశాంత్ ,సుమంత్ లలో సరైన హిట్ అందుకున్న హీరో ఒకరు లేరు .నాగ చైతన్య నటించిన ఏం మాయ చేసావే ,మనం,మజిలీ సినిమాల్లోకధ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . అఖిల్ సినిమాల్లో కూడా కథ పరం హిట్ ఉన్న నటన పరంగా మంచి గుర్తింపు ఉన్న సినిమాలు లేవు. సుశాంత్ హీరో గా పరిచయం అయ్యి కొన్ని సినిమాల తర్వాత చాల కాలం సినిమాలల్లో కనిపించలేదు . చాల గ్యాప్ తరువాత ఆలా వైకుంఠపురంలో మంచి పాత్రతో కనిపించారు . ,అదే తరహాలో ఇప్పుడు మెగా హీరో ల సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు సుమంత్ కూడా మొదట్లో హీరో గా మంచి పేరు తెచ్చుకున్న సరైన సినిమాల్లేక కొన్ని వ్యక్తిగత కారణాల వాళ్ళ దూరంగ ఉన్నారు కొన్నాళ్ళు . ఇప్పుడు మంచి గుర్తింపు ఉన్న ప్రత్యేక పాత్రలను చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు .ఇటీవల సీత రామం ,తాజాగా సార్ సినిమాల్లో కూడా మంచి పాత్రలను పోషించారు.
నిర్మాతగా ఒక చరిత్రను సృష్టించిన రామానాయుడు తన తరువాత తరం దగ్గుబాటి వెంకటేష్ వీరి ఫామిలీ లో టాప్ ఫామిలీ హీరో అని చెప్పుకోవచ్చు.అయన తర్వాత వచ్చిన రానా కూడా నటనలో వైవిద్యం చూపించిన సినిమాలు ఉన్నపటికీ గుర్తింపు ఇచ్చిన హిట్ మూవీ అయితే ఏమి లేవు.ఏది ఏమైనా నటనలో,గుర్తింపులో వారసత్వం ఉన్నపటికీ ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాలంటే మంచి నటనతో స్వయంగా తెచ్చుకున్న గుర్తింపు ఉండాల్సిందే అని తెలుస్తుంది . వారసత్వం కేవలం గుర్తింపు మాత్రం ఇవ్వగలదు సక్సెస్ ని ఇవ్వలేదు అనేదానికి తెలుగు హీరోలు చాల మంది ఉన్నారు