హీరో నితిన్‌(Nithini) తండ్రి అయ్యాడు. నితిన్‌ భార్య షాలి(Shalini)ని మగబిడ్డను ప్రసవించింది.

హీరో నితిన్‌(Nithini) తండ్రి అయ్యాడు. నితిన్‌ భార్య షాలి(Shalini)ని మగబిడ్డను ప్రసవించింది. తనకు కొడుకు పుట్టాడని, చిట్టిచేతులను, తన చేతిలోకి తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా నితిన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. నితిన్-షాలిని ప్రేమించి 2020 జులైలో కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. యాక్చువల్‌గా 2020 ఏప్రిల్‌ 16న దుబాయ్‌(Dubai)లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని తొలుత భావించినప్పటికీ కోవిడ్‌ కారణంగా అప్పుడు వాయిదా పడింది. అయితే నితిన్‌ పెళ్లి, తండ్రి అయ్యేవరకు కొంత రహస్యంగానే ఉంటున్నారు. షాలినిని ఐదేళ్లుగా ప్రేమించినా అతని ప్రేమ విషయం 2020 ఫిబ్రవరి 14న బయటపెట్టాడు. ఇప్పుడు తండ్రి అవుతున్నానని కూడా ఎక్కడా సమాచారం లీక్‌ కాలేదు. కొడుకు పుట్టిన విషయాన్ని అకస్మాత్తుగా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా నితిన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సమంత(Samantha), వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి, సాయిదుర్గతేజ్‌ కాకుండా చాలామంది టాలీవుడ్‌ ప్రముఖులు నితిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నితిన్‌ రెండు సినిమాలు చేస్తున్నాడు. రాబిన్‌హుడ్‌, తమ్ముడు సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబిన్‌హుడ్‌ రానుంది.

ehatv

ehatv

Next Story