VV Vinayak : వైసీపీలోకి వి.వి.వినాయక్.. కాకినాడ నుంచో ఏలూరు నుంచో పోటీ
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఎన్నికల వేడి మొదలయ్యింది. నాలుగైదు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు, దాంతో పాటుగానే లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయా పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ(YSRCP) అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని ముఖ్యమంత్రి జగన్(CM Jagan) డిసైడయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఎన్నికల వేడి మొదలయ్యింది. నాలుగైదు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు, దాంతో పాటుగానే లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయా పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ(YSRCP) అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని ముఖ్యమంత్రి జగన్(CM Jagan) డిసైడయ్యారు. చాలా స్థానాలలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. పనిలో పనిగా సినీ గ్లామర్‌ను కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ను(VV Vinayak) పార్టీలో చేర్చుకోవాలని జగన్ అనుకుంఉటన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు(Pawan Kalyan) పోటీగా వినాయక్‌ను బరిలో దింపాలన్నది జగన్ ఆలోచన! పైగా వినాయక్ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆయనను కాకినాడ(Kakinada) నుంచో, ఏలూరు (Eluru)నుంచో బరిలో దింపాలని జగన్ భావిస్తున్నారు. అయితే చిరంజీవి(Chiranjeevi) ఫ్యామిలీకి వినాయక్ చాలా సన్నిహితంగా ఉంటారు. అలాంటిది పవన్‌కల్యాణ్‌కు పోటీగా నిలబడతారా? నిలబడి పవన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అనేదే డౌట్!మెగాస్టార్‌ను అన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకునే వినాయక్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరతారని తాము అనుకోవడం లేదని కొందరు అంటున్నారు. ప్రస్తుతం వినాయక్ సినీ కెరీర్ కూడా ఏమంత బాగోలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో సినిమాలు(Cinema) లేవు. మొన్నామధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో హిందీలో చత్రపతి సినిమాను రిమేక్ చేశాడు వినాయక్.. అది అట్టర్‌ఫ్లాప్ అయ్యింది.