తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి వంద రోజులు నిండిన సందర్భంగా అభినందనలు. ఈ వంద రోజులుగా నేను మిమ్మల్ని కలవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రంగాల వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసి వెళుతున్నారు. అలాంటి అవకాశం నాకు రాకపోవడం విడ్డూరంగా ఉంది. నన్ను నేను మీకు ప్రత్యేకంగా పరిచయం చేసుకోవలసిన అవసరం లేదనుకుంటాను.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, కవి, రచయిత బి.నరసింగరావు(B. Narasingrao) ఆత్మీయతతో కూడిన ఓ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా....

తెలంగాణ ముఖ్యమంత్రి గారికి

తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి వంద రోజులు నిండిన సందర్భంగా అభినందనలు. ఈ వంద రోజులుగా నేను మిమ్మల్ని కలవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రంగాల వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసి వెళుతున్నారు. అలాంటి అవకాశం నాకు రాకపోవడం విడ్డూరంగా ఉంది. నన్ను నేను మీకు ప్రత్యేకంగా పరిచయం చేసుకోవలసిన అవసరం లేదనుకుంటాను.
ఈ లేఖ రాయడానికి ముఖ్య కారణం, నేను మీతో కలిసి కొన్ని అత్యవసర విషయాలు మాట్లాడవలసి ఉండడమే : తెలంగాణ ప్రజా సంస్కృతిక సినిమా రంగాల గురించి మీతో మాట్లాడాలి. ఈ సందర్భంలో ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఇంకా కాలయాపన మంచిది కాదు. పైన పేర్కొన్న రంగాలలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ముఖ్యమైన అంశాలను మనం పూర్తి చేయవలసి ఉంది. పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డ సాంస్కృతిక అంశాలను నేటి ప్రభుత్వం పైకిఎత్తి పట్టుకోవలసిన అవసరం కోసం ప్రణాళికలు రూపొందించుకొని తెలంగాణను నూతనంగా ఆవిష్కరించుకునే అంశాలను మీతో నేను చర్చించాలి. దీనికి మీ స్పందన కోసం వేచి ఉంటాను.

శుభాభినందనలతో
బి .నరసింగరావు

Updated On 6 March 2024 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story