మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. మెగా అభిమానుల దగ్గర నుంచి.. స్టార్ సెలబ్రిటీల వరకూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రకరకాల పద్దతుల్లో మెగా బర్త్ డే ను సెలబ్రేట్ చేశారు. మెగాస్టార్ కు అందరకింటే ముందే శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి అని పవన్ కోరకున్నారు.

Tollywood Celebrity Wishes To Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బర్త్ డే(Birthday) సందర్భంగా సంబరాలు అదరిపోయాయి.. అభిమానులతో పాటు.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చిరును విష్ చేశారు ఎవరెవరు చేశారంటే..?
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. మెగా అభిమానుల దగ్గర నుంచి.. స్టార్ సెలబ్రిటీల వరకూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రకరకాల పద్దతుల్లో మెగా బర్త్ డే ను సెలబ్రేట్ చేశారు. మెగాస్టార్ కు అందరకింటే ముందే శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి అని పవన్ కోరకున్నారు.
అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) మెగాస్టార్ ను విష్ చేశారు. మంచి ఆరోగ్యకరమైన జీవితం మీకు కలగాలి అంటూ.. హ్యాపీబర్త్ డే మెగాస్టార్ చిరంజీవిగారు అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్.
అల్లు అర్జున్(Allu arjun) విషెష్ కోసం అంతా ఎదరు చూశారు. అయితే ఐకాన్ స్టార్ మాత్రం చాలా సింపుల్ గా మెగాస్టార్ కు బర్త్ డే విఫ్ చేశారు. మెగా బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ విష్ చేశారు.. వన్ అండ్ ఓన్లీ.. మెగాస్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ విష్ చేశారు బన్నీ.
మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి కూడా వరుసగా విషెష్ అందాయి మెగాస్టార్ ను డాడీ అని పిలుచుకునే.. నాగబాబు తనయుడు.. హీరో వరుణ్ తేజ్(varun tej) ట్వీట్ చేస్తూ... మా చిరు నవ్వు. మా అందరి ఆనందం.. మా ఫ్యామిలీకి కొండంత ధైర్యం అని అంటూ.. హ్యాపీబర్త్ డే మెగాస్టార్ చిరంజీవి అంటూ ట్వీట్ చేశారు వరుణ్ తేజ్.
అంతే కాదు మెగాస్టార్ కు సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) ముద్దు పెడుతున్న ఫోటోను కూడా శేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్. మా అందరికి ఆదర్శం. మంచి మనసు ఉన్న మా పెద్ద మామ మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ.. సాయి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.
బాస్ ఆఫ్ మాస్.. వన్ అండ్ ఒన్లీ మెగాస్టార్ కు హ్యాపీ బర్త్ డే అంటూ.. విష్ చేశారు టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ సంస్థ గీతాఆర్ట్స్(Geetha Arts) ట్వీట్ చేసింది. వీరితో పాటు హారికా అండ్ హాసినీ క్రియేషన్స్(Harika and haisini creations).. యూవీ క్రియేషన్స్(UV Creations) కూడా మెగాస్టార్ ను విష్ చేశారు.
ఇక యంగ్ హీరోలు చాలా మంది మెగాస్టార్ కు బర్త్ డే విష్ చెపుతున్నారు. అందులో యువ హీరో కార్తికేయ(Karthikeya) మెగాస్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. వీరితో పాటు చంద్రబాబు, మహేష్ బాబు, ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
