2023 సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకు(Tollywood) నష్టాలనే మిగిల్చింది. రెండు మూడు హిట్లను పట్టుకుని తెలుగు చిత్ర పరిశ్రమ బ్రహ్మండంగా ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వమే అవుతుంది. 2023లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ. కేవలం అయిదారు శాతం సక్సెస్ రేటు ఉన్నదంతే. వందల్లో సినిమాలు విడుదలైతే ఆడింది అయిదో ఆరో సినిమాలన్నమాట! ఏడాది ఇండస్ట్రీకి ఆదిపురుష్‌తో(Adipurush) ఓ పెద్ద దెబ్బ తగిలింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. పెద్ద డిజాస్టర్‌గా మారింది. ఓంరౌత్(Om Raut) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.
2023 సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకు(Tollywood) నష్టాలనే మిగిల్చింది. రెండు మూడు హిట్లను పట్టుకుని తెలుగు చిత్ర పరిశ్రమ బ్రహ్మండంగా ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వమే అవుతుంది. 2023లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ. కేవలం అయిదారు శాతం సక్సెస్ రేటు ఉన్నదంతే. వందల్లో సినిమాలు విడుదలైతే ఆడింది అయిదో ఆరో సినిమాలన్నమాట! ఏడాది ఇండస్ట్రీకి ఆదిపురుష్‌తో(Adipurush) ఓ పెద్ద దెబ్బ తగిలింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. పెద్ద డిజాస్టర్‌గా మారింది. ఓంరౌత్(Om Raut) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఏ పాత్రను కూడా సరిగ్గా చూపించలేదని, డైలాగులు అస్సలు బాగోలేవని చెప్పుకున్నారంతా! నిజానికి ఈ సినిమా కట్టర్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్‌కే నచ్చలేదు. ఇక సినీ అభిమానులకు ఎలా నచ్చుతుంది. రెండో బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళాశంకరే!(Bhola shankar) చిరంజీవి మెగాస్టార్ అయ్యాక ఇంతటి దారుణమైన ఫ్లాప్‌ను చూసి ఉండరు. ఆచార్యనే(Acharya) బిగ్గెస్ట్ ఫ్లాప్ అనుకుంటే భోళాశంకర్ అంతకు రెండు మూడింతలు ఫ్లాప్ అయ్యింది. సినిమా విడుదల తర్వాత రెండో ఆటకే అభిమానులు కూడా సైలెంటయ్యారు. చిరంజీవి కెరీర్‌లోనే ఇది చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది. చిరంజీవి ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది. నాగార్జున(Nagarjuna) కొడుకు అఖిల్(Akhil) హీరోగా నటించిన ఏజెంట్(agent) కూడా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. అందరికీ భారీ నష్టాలను మిగిల్చింది. అటు సమంత(Samantha), ఇటు గుణశేఖర్‌లు ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం(Shakunthalam) అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. సినిమాకు పెట్టుబడి పెట్టిన గుణశేఖర్‌తో(Gunashekar) పాటు దిల్ రాజు(Dil Raju) కూడా తీవ్రంగా నష్టపోయారు. రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర(Ravasura) కూడా అంతే! రవితేజకు ఇలాంటి ఫ్లాప్‌లు కొత్త కాదు కానీ ధమాక, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత రావణాసుర ఆడకపోవడమే రవితేజ ఫ్యాన్స్‌ను బాధించి ఉంటుంది. రవితేజ నటించిన మరో సినిమా టైగర్ నాగేశ్వరరావు కూడా డిటోడిటో. పవన కల్యాణ్(Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్‌తో కలసి బ్రోలో నటించాడు. ఇది కూడా ఘోరంగా దెబ్బతిన్నది. వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) నటించిన ఆదికేశవ(Adhikeshava) , వరుణ్ తేజ్(Varun) నటించిన గాండీవధారి అర్జున సినిమాలు బాక్సాఫీసు దగ్గర చతికిలబడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సినిమాలేవీ ఈ ఏడాది విడుదల కాలేదు. బోయపాటి శ్రీను(Boyapati Srinu), రామ్(Ram) కాంబినేషన్‌లో వచ్చిన స్కంద(Skanda) సినిమా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. రామబాణం సినిమా గురి తప్పింది. ఎక్స్ ట్రా ఆర్డినరీమేన్(Extraodinary Men), అమిగోస్, స్పై, హంట్... ఇలా చెప్పుకుంటూ వెళితే టాలీవుడ్‌లో ఫ్లాపులకు లెక్కేలేదు.