త్రిబుల్ ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటికీ, ఆ సినిమా సక్సెస్‌లో తానూ ప్రధానమైన భాగమైనప్పటికీ కూడా త్రిబుల్ ఆర్ చిత్రం రామ్ చరణ్‌కే ఎక్కువగా వత్తాసు పలికినట్టయింది చివరాఖరికి. ప్రపంచమంతా రామ్ చరణ్ పేరే మారుమ్రోగిపోయింది. గ్లోబల్ స్టార్ రేంజ్‌కి అవలీలగా చరణ్ రివ్వుమన్నాడు. హాలీవుడ్ సినిమాలు కూడా చరణ్ ఇంటిదగ్గర వెయిట్ చేసే స్థాయికి అమాంతం ఎదిగి, తెలుగు సినిమా అంటే చరణే అన్న ఇమేజ్ వచ్చేసింది. అందరూ ఒప్పుకోవాల్సి కూడా వచ్చింది. అల్లు అర్జున్ అంతకు ముందు అలవైకుంఠపురం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి, పుష్ఫతో ఆలిండియా బోర్డర్స్‌ని అవలీలగా క్రాస్ చేసే, ఆలిండియా ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు పుష్ఫ టు విడుదలకు ముందే సంచలనం రేపుతోంది. మొత్తం దేశమంతా పుష్ఫ టు గురించే ఎదురుచూపులు.
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో మూడో నాలుగో పెద్ద హీరోల పేర్లు వినిపించేవి. వాళ్ళ సినిమాలు కూడా హిట్టవుతూ, తెలియని పోటీ నడిచేది. తర్వాతి రోజులలో, మెగాస్టార్ రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత క్రమేపి, ఆయాహీరోల కొడుకులు పరిశ్రమలోకి ప్రవేశించారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు నాగ చైతన్య, అర్జున్...ఇలా సినిమా ఇండస్ట్రీలో పోటీకి తలపడ్డారు. ఇంకొద్ది కాలానికి అటూఇటూగా సాయిధర్మతేజ, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ ఇలా తెరంగేట్రం చేశారు. కానీ, పబ్లిక్ ఫాలోయింగ్, స్క్రీన్ గ్లామర్‌లాటి అంశాలలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ముందు వరుసను ఆక్రమించుకున్నారు. అందులో కూడా మళ్ళీ రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇండస్ట్రీ హిట్స్‌తో టాప్ గేర్ వేయగలిగారు. ప్రభాస్ మాత్రం బాహుబలితో ఎంత పేరుప్రతిష్టలతో ఎదిగాడో, రాధేశ్యామ్‌తో అంత జారపోయాడు. కానీ రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ మాత్రం సినిమాసినిమాకి రైజ్ అవుతూ తమకింక తిరుగులేదని నిరూపించుకున్నారు.
త్రిబుల్ ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటికీ, ఆ సినిమా సక్సెస్‌లో తానూ ప్రధానమైన భాగమైనప్పటికీ కూడా త్రిబుల్ ఆర్ చిత్రం రామ్ చరణ్‌కే ఎక్కువగా వత్తాసు పలికినట్టయింది చివరాఖరికి. ప్రపంచమంతా రామ్ చరణ్ పేరే మారుమ్రోగిపోయింది. గ్లోబల్ స్టార్ రేంజ్‌కి అవలీలగా చరణ్ రివ్వుమన్నాడు. హాలీవుడ్ సినిమాలు కూడా చరణ్ ఇంటిదగ్గర వెయిట్ చేసే స్థాయికి అమాంతం ఎదిగి, తెలుగు సినిమా అంటే చరణే అన్న ఇమేజ్ వచ్చేసింది. అందరూ ఒప్పుకోవాల్సి కూడా వచ్చింది. అల్లు అర్జున్ అంతకు ముందు అలవైకుంఠపురం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి, పుష్ఫతో ఆలిండియా బోర్డర్స్‌ని అవలీలగా క్రాస్ చేసే, ఆలిండియా ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు పుష్ఫ టు విడుదలకు ముందే సంచలనం రేపుతోంది. మొత్తం దేశమంతా పుష్ఫ టు గురించే ఎదురుచూపులు.
మహేష్ బాబుకి చెప్పుకోదగ్గ హిట్టే రాలేదీ మధ్యన. నాగచైతన్య సరేసరి. ఎక్కుడన్నాడో అన్నట్టుగా ఉంది పరిస్థితి. హిట్ అన్న ప్రస్తావనే లేకుండా నత్తనడక నడుస్తున్న అక్కినేని అఖిల్ ఇప్పుడిప్పుడే ఏజెంట్ సినిమా ప్రమోషన్లతో కొంత లైట్‌లోకి వచ్చాడు మళ్ళీ. కానీ, అవతలవైపున సాయిధర్మతేజ తమ్ముడు వైష్ణో తేజ్ ఉప్పెన సినిమాతో సునామీలా దూపుకొచ్చి, అందరకీ తనుకూడా పోటీయే అన్నట్టుగా మారాడు. అటు వెంకటేష్ మైల్డ్ డోస్ సినిమాలతో సర్దిచెప్పుకుంటూంటే, రానా సౌండే లేదు. పైగా రానా నాయుడు వెబ్ సిరీస్‌తో ఎక్కడ లేని, ఎప్పుడూ లేని అపవాదులు, విమర్శలకు వెంకటేష్ అండ్ రానా ఇద్దరికిద్దరూ అప్రతిష్టను మూటగట్టుకున్నారు.
తాజాగా నిన్ననే విడుదలైన విరూపాక్ష చిత్రంతో సాయిధర్మతేజ మరోసారి జెండా ఎగరేశాడు. దానాదీనా చూస్తే సందడంతా మెగా క్యాంప్‌లోనే సెంటర్ చేసుకుంది. మెగాతీరంలోనే విజయాల తుఫాను కేంద్రీకృతమై, మిగతా క్యాంప్‌లన్నిటినీ బలహీనం చేసి, పలచేసి పారేసింది. మెగా క్యాంప్‌లో వారు తప్పితే మరొకరు నోరువిప్పుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ఏజెంట్ అదృష్టం కొద్దీ లేదా అందరి కష్టం ఫలించి ఆడితే గనక అఖిల్‌కి చెప్పుకోవడానికి ఒక సినిమా దక్కుతుంది. అది గనక తేడా వచ్చిందంటే వైకుంఠపాళీలో మళ్ళీ పాము మింగేసినట్టే.
మెగాస్టార్ చిరంజీవి లైన్‌అప్‌లో యువరత్న బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను లెక్కకు తీసుకుంటే మెగాస్టార్ మాత్రం మళ్ళీ ఇండస్ట్రీయే వణికే హిట్ వాల్టేర్ వీరయ్యను సొంతం చేసుకోగలిగారు ఇప్పుడు కూడా. బాలకృష్ణ కూడా వీరసింహారెడ్డితో తన స్థానాన్ని పదిలపరుచుకోవడమే కాకుండా తన స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నారు. నాగార్జున పూర్తిగా మ్యూట్‌లోకి వెళ్ళిపోయారని ఆయన అభిమానులు వర్రీ అవుతున్నారు. ఇంక మోహన్‌బాబు, రాజశేఖర్‌ల పరిస్థితి వర్ణనాతీతం. మెగాక్యాంప్‌కి సంబంధించి మెగాస్టార్ హవా ఎక్కడా పలచబడలేదు. ఇంకా ఇంకా బలపడుతూనే ఉంది.
ఇంతవరకూ చెప్పని పేరు ఒకటుంది. అనుకోవచ్చు....ఈ పేరు ప్రస్తావించడం లేదేమిటి అని. ఆ పేరును ప్రస్తావించనక్కర్లేదు. ఆ పేరే వేరే ఇండస్ట్రీ. అది వేరే సంచలనం. అది వేరే చరిత్రగమనం. అదే పవన్ కళ్యాణ్. మెగాక్యాంప్‌కి పవన్ కళ్యాణ్ ఒక కలికి తురాయి. పవనిజం అన్నది దావానలం. ఒక్కసారి అంటుకుందా అంతే అడ్రస్‌లు గల్లంతైపోతాయి. అదీ పవన్ కళ్యాణ్ ఫైర్ బ్రాండ్. పవర్ స్టార్ సినిమా వస్తోందంటే అందరికీ దడే. ఖుషీ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న ఎ. ఎం. రత్నం, పవర్‌స్టార్, క్రిష్‌ల పీరియడ్ ఫిల్మ్ మీద ఆంచనాలు మామ్మూలుగా లేవు. అటు రాజకీయంగా కూడా పవర్ స్టార్‌దే పైచేయిగా సాగుతోంది ఆంద్రలో సంచలనం.
ఇప్పుడు చెప్పండి... ఏ క్యాంపుది హై హేండ్... ఎవరి హవా బ్రాండ్?