టాలీవుడ్ యాంకర్ గారికార్డ్ లు క్రియేట్ చేస్తోంది సుమ(Anchor Suma). 50 ఏళ్లకుఅతి దగ్గరలో ఉన్న ఈ సీనియర్ యాంకర్..ఎక్కువ కాలం యాంకరింగ్ చేసిన సెలబ్రిటీగారికార్డ్స్ క్రీయేట్ చేసింది. ఇంకా కొంత కాలం ఇలానే కొనసాగితే.. గిన్నిస్ బుక్(Guinness Book) లోకి కూడా ఎక్కేస్తుంది. సుమ మలయాళీ అమ్మాయి అయినా.. తెలుగింటి కోడలు.

టాలీవుడ్ యాంకర్ గారికార్డ్ లు క్రియేట్ చేస్తోంది సుమ(Anchor Suma). 50 ఏళ్లకుఅతి దగ్గరలో ఉన్న ఈ సీనియర్ యాంకర్..ఎక్కువ కాలం యాంకరింగ్ చేసిన సెలబ్రిటీగారికార్డ్స్ క్రీయేట్ చేసింది. ఇంకా కొంత కాలం ఇలానే కొనసాగితే.. గిన్నిస్ బుక్(Guinness Book) లోకి కూడా ఎక్కేస్తుంది. సుమ మలయాళీ అమ్మాయి అయినా.. తెలుగింటి కోడలు. ఇక్కడే పుట్టి పెరినవారు కూడా మాట్లాడలేనంత స్పంష్టంగా తెలుగు మాట్లాడుతుంది. ఆ టాలెంట్ తోనే.. సందర్భానికి తగ్గట్టు స్పందించగల తెలివి ఉండటంతోనే 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ వస్తున్నారు.

రెండు దశాబ్ధాలుగా.. యాంకర్ గా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు నటిగా సినిమాలు, యూట్యూబ్ వీడియోలు.. ఇలా ఒక్కటేమిటి.. ఎంటర్టైన్మెంట్ అంటే సుమ గుర్తుకువచ్చేలా చేసుకుంది సీనియర్ తార. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా యాక్టీవ్ గా ఉంటుంది సీనియర్ స్టార్.. ఇక అప్పుడప్పుడు నెట్టింట్లో ఆమె తను చేసే వంటలు, తన ఫ్యామిలీ విషయాలు, కుటుంబసభ్యుల విషయాలను కూడా సుమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె తన తాతయ్య గురించిన ఒక పోస్ట్ వేశారు.

సుమ తాతగారు(Suma Grandfather) ఓ రికార్డ్ ను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 98 ఏళ్ళు. సుమ. తాత అంటే.. సుమ వాళ్ల అమ్మమ్మ గారి బ్రదర్. ఆయన పేరు పి బాలసుబ్రమణ్యన్ మీనన్(Bala subramanyam menon). 98 ఏళ్ల వయస్సులో ఆయన అరుదైన గౌరవం అందుకున్నారు. ఈయన ఒక అడ్వకేట్. గత 73 ఏళ్ళగా ఈయన ఈ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్ల లాంగ్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న ఏకైక లాయర్ గా మీనన్ వరల్డ్ రికార్డు సృష్టించారు. దీంతో గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు ఇది గమనించి.. ఆయనకు అవార్డుని అందించారు.

ఇక ఈ విషయాన్ని యాంకర్ సుమ సోషల్ మీడియాలో పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇటుసుమ కూడా యాంకర్ గా ఎన్నో రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇన్నేళ్లు యాంకరింగ్ ప్రొఫిషన్ లో కొనసాగిన వ్యక్తి మరొకరు లేరు. అది సుమకు మాత్రమే సాధ్యం అయ్యింది. ఆమె మరికొన్నేళ్ళు ఇలాగే కొనసాగితే..సుమ కూడా గిన్నిస్ రికార్డ్ సాధించడం ఖాయం.

Updated On 10 Nov 2023 8:48 AM GMT
Ehatv

Ehatv

Next Story