ఫస్ట్ టైమ్ దసరా సినిమా(Dasara Movie)తో బాలీవుడ్(Bollywood) కు వెళ్తుంది కీర్తి సురేష్(Keerthy Suresh)..ఈసినిమా ప్రమోషన్స్(Movie Promotions) లో బాగంగా.. అక్కడి మీడియాతో మాట్లాడిన కీర్తి సురేష్.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

ఫస్ట్ టైమ్ దసరా సినిమా(Dasara Movie)తో బాలీవుడ్(Bollywood) కు వెళ్తుంది కీర్తి సురేష్(Keerthy Suresh)..ఈసినిమా ప్రమోషన్స్(Movie Promotions) లో బాగంగా.. అక్కడి మీడియాతో మాట్లాడిన కీర్తి సురేష్.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

టాలీవుడ్ లో హీరోయిన్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతోంది కీర్తి సురేష్.. వరుస సినిమాలలో నటిస్తుంది కాని. మొన్నటి వరకూ ఫెయిల్యూర్స్ మధ్య కొట్టుమిట్టాడింది కీర్తి సురేష్. మహానటిగా..హెమ్లీ బ్యూటీగా ఉన్న కీర్తి సురేష్..సర్కారువారి పాట సినిమాతో కమర్షియల్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు తన పద్దతులు కూడా మార్చుకుని. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సందడి చేస్తుంది. మూసనుంచి బయటపడి, కమర్షియల్ సక్సెస్ లు సాధిచాలని పట్టుదలతో ఉంది. ఇక ప్రస్తుతం నానీ జతగా.. దసరా సినిమాలో నటించింది కీర్తీ సురేష్.

ఈసినిమా తో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాను టచ్ చేయబొతుంది. ఇక ఈమూవీ ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉంది కీర్తి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. బాలీవుడ్ ప్రమోషన్స్ కూడా స్పీడ్ పెంచేసింది. అయితే బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన కీర్తి సురేష్.. ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. బాలీవుడ్ లో ఇప్పటి వరకూ సినిమా చేయలేదు కీర్తి సురేష్. సౌత్ కే పరిమితం అయ్యింది. ఇక్కడ అవకాశాల గురించి ముంబయ్ మీడియా వరుసగా ప్రశ్నలు వేయడంతో కీర్తి స్ట్రైట్ గా సమాధానం చెప్పింది.

మీడియా ప్రతినిధులు తనకు ప్రశ్నిస్తూ బాలీవుడ్ సినిమాలలో నటించాలని లేదా అంటూ ప్రశ్నించడంతో తనకు అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం వస్తే ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అందుకు కీర్తి సురేష్ తనకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోనని అన్నది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతే కాదు తను కెరీర్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానంటోంది బ్యూటీ. మహానటి సినిమా టైమ్ లో తనను బాగా ట్రోల్ చేశారని. కాని తాను అవేవీ పట్టించుకోలేదు అంటోంది. సావిత్రమ్మ పాత్ర చేయడం అంటే భయం వేసిందని. కాని దర్శకుడు నాగ్ అశ్వీన్ ప్రోత్సాహంత్ పర్ఫెక్ట్గా చేయగలిగానంటోంది బ్యూటీ. ఇక తనను విమర్షించే వారు చాలా మంది ఉన్నారని.. వారిని పట్టించుకుంటే పోతే జీవితాన్ని అనుభవించలేం అంటోంది బ్యూటీ.. అందుకే తాను ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోను అంటోంది కీర్తి.

ఇక దసరా సినిమా తరువాత కీర్తి సురేష్ కి టాలీవుడ్ లో మరో సినిమా లేదు. ఏ సినిమాపై ఆమె సైన్ చేయలేదు. తమిళంలో మాత్రం నాలుగు సినిమాలు చేస్తోంది బ్యూటీ. తన మాతృభాష మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తోంది. ఇక దసరా సినిమా కనుక హిట్ అయితే.. పాన్ ఇండియాలో కీర్తి పేరు మారుమోగే అవకాశం ఉంది. బాలీవుడ్ నుంచి కూడా తాను అనుకున్నట్టుగా అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోక తప్పదు.

Updated On 27 March 2023 12:11 AM GMT
Ehatv

Ehatv

Next Story