సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharma Tej)ది దొడ్డ మనసు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోనే మంచి మనసు
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharma Tej)ది దొడ్డ మనసు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోనే మంచి మనసు. ఆర్ధికంగా చితికిపోయి, అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సీనియర్ నటి(senior Acor) పావలా శ్యామలకు(pavala shyamala) ఆర్ధిక సాయం చేసి మన్ననలు పొందాడు. వీడియో కాల్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పాడు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు(Telugu Film Journalists Association)అయిదు లక్షల రూపాయలను(5lakhs)విరాళంగా ఇచ్చిన సాయ ధరమ్ తేజ్ లక్ష రూపాయలను(1 lakh) పావలా శ్యామలకు అందించాడు. వీడియో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు పావలా శ్యామల భావోద్వేగాలకు గురయ్యారు. తన అమ్మాయికి ఆపరేషన్ అయినప్పుడు సాయిధరమ్ తేజే తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తనే వచ్చి కలుస్తానన్నాడని, కానీ చాలా రోజులైనా తేజు రాకపోవడంతో.. తనను మర్చిపోయారేమో అనుకున్నానని శ్యామల అన్నారు. గుర్తుపెట్టుకొని ఇప్పుడు సాయం చేయడంతో శ్యామల ఎమోషనల్ అయ్యారు. తేజుకు ధన్యవాదాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు చిరంజీవి(chiranjeevi)తనకు చేసిన సాయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు శ్యామల. శ్యామల మాటలకు సాయి ధరమ్ తేజ్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.