ఎన్టీఆర్(NTR) గురించి టాలీవుడ్ ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నిజ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ధైర్యంగా ఎదుర్కొన్న తారక్.. యంగ్ టైగర్ అని బిరుదుకూడా పొందాడు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే.. టైగర్ వేటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఫ్యాస్ ఉర్రూతలూగిపోతారు.. అటువంటి ఎన్టీఆర్ కూడా ఒక వ్యక్తిని చూస్తే భయపడతారట.

ఎన్టీఆర్(NTR) గురించి టాలీవుడ్ ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నిజ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ధైర్యంగా ఎదుర్కొన్న తారక్.. యంగ్ టైగర్ అని బిరుదుకూడా పొందాడు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే.. టైగర్ వేటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఫ్యాస్ ఉర్రూతలూగిపోతారు.. అటువంటి ఎన్టీఆర్ కూడా ఒక వ్యక్తిని చూస్తే భయపడతారట. భయపడటమే కాదు.. పారిపోతాడట కూడా.. ఈ విషయాన్ని స్వయంగా తారక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇంతకీ యంగ్ టైగర్ ను కూడా భయపట్టించే ఆ వ్యక్తి ఎవరో తెలుసా..

ఇంతకీ ఆ వ్యాక్తి ఎవరంటే..? ఎన్టీఆర్ కొడుకు(NTR Son) అభయ్ రామ్‌(Abhay Ram). అభయ్ రామ్ ను చూసి తాను పారపోతానని.. అతడికి కనిపించకుండా ఇంట్లో కూడా తప్పించకు తిరుగుతానని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఎన్టీఆర్. అభయ్ రామ్‌కు తాను భయపడతానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. వాడు కొడుకు కాదు క్వశ్చన్ బ్యాంక్. ఎప్పుడు ఏదో ఒక ప్రశ్నను బుర్రలో పెట్టుకొని తీరుగుతూ ఉంటాడు. వాడు అడిగిన ప్రశ్నలకు నేను చాలా ఓపికగా సమాధానాలు చెప్తూ ఉంటా.. ఒక్కోసారి వాడు అడిగే ప్రశ్నలు ఏంటో అస్సలు అర్ధం కాదు. ఆ సమయంలో వాడి నుంచి తప్పించుకొని పారిపోతాను. అంటూ తారక్ చెప్పుకొచ్చాడు.

ఇక తన కొడుకు అభయ్ రామ్ గురించి ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు తన ఫ్యామిలీ గురించి ఇంకొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పాడు తారక్. తాను నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాను తన ఫ్యామిలీతో కలిసి ఓ ప్రైవేట్ థియేటర్లో చూశానని. అది చూసినప్పుడు, తన ఎంట్రీ సీన్ చూసి తన తల్లి ఎంతో సంతోషించిందన్నారు. అంతే కాదు బాగా చేశావ్.. అంటూ మెచ్చుకొని నా పక్కన కూర్చొని సినిమా చూసింది అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. ఈ ఘటన తాను ఎప్పటికీ మర్చిపోనని ఎన్టీఆర్ అన్నారు.

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ఎన్టీఆర్. ఆస్కార్ సాధించడంతో పాటు.. బాలీవుడ్.. హాలీవుడ్ లో కూడా ఓరేంజ్ లో ఇమేజ్ సాధించాడు ఎన్టీఆర్. బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు కూడా యంగ్ టైగర్ గుమ్మం ముందు క్యూ కడుతున్నాయి. రీసెంట్ గా తన 30వ సినిమాను కొరటా శివ డైరెక్షన్ లో స్టార్ట్ చేవాడు ఎన్టీఆర్. ఆతరువాత ప్రశాంత్ నీల్ తో మూవీ చేయబోతున్నాడు. ఈరెండు పాన్ ఇండియా మూవీస్ గా రూపొంతుతున్నాయి. ఆరువాత బాలీవుడ్ లో తారక్ సినిమా ఉంటుంది అంటున్నారు. మరి ముందు ముందు తారక్ ఇంకెన్ని ఫీట్లు సాధిస్తాడో చూడాలి.

Updated On 27 March 2023 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story