సూపర్ ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గోంటూ.. రెస్ట్ లెస్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బోళాశంకర్(Bhola Shankar) కోసం యాక్షన్ పార్టు లో బిజీగా ఉన్నాడు చిరు.

సూపర్ ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గోంటూ.. రెస్ట్ లెస్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బోళాశంకర్(Bhola Shankar) కోసం యాక్షన్ పార్టు లో బిజీగా ఉన్నాడు చిరు.

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా.. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. జయాపజయాలతో సంబంధం లుకుండా సినిమాలు చేస్తున్న చిరంజీవికి.. ఆచార్యతో పెద్ద దెబ్బ తగిలింది. ఆరువాత అలర్ట్ అయిన మెగాస్టార్.. వెంటనే గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టాడు. ఇక రీసెంట్ గా 2023 ని బ్లాక్ బస్టర్ హిట్టుతో స్టార్ట్ చేశాడు. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాతో అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చాడు మెగా హీరో. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja).. దాదాపు 25 ఏళ్ల తరువాత చిరంజీవికి తమ్ముడిగా నటించాడు.

ఇక ప్రస్తుతం మేహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ (Bhola Shankar) సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది. ప్రస్తుతం ఈమూవీ యాక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయింది. మెగాస్టార్ తో అద్భుతమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు టీమ్.ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.

ఇక తమిళంలో స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం మూవీకి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈమూవీలో మెగా జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) నటిస్తుండగా, మరో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh). చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంన్నాడు. వీరితో పాటుగా మురళి శర్మ, రఘుబాబు, వెన్నల కిషోర్, శ్రీముఖి, సత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యాంకర్ రష్మీ చిరుతో కలిసి ఐటమ్ సాంగ్ లో చిందేస్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

Updated On 27 March 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story