టైటానిక్‌ నౌక మునిగిపోయిన ప్రదేశానికి వెళ్లడమే ఓ సాహసం.. ఎందుకంటే అది ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశం.. ఈ మాటన్నది టైటానిక్‌ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేక సార్లు సందర్శించిన దిగ్దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌(James Cameron). అవతార్‌(Avatar) వంటి భారీ చిత్రాలను తీసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న జేమ్స్‌ కామెరూన్‌ అంతకు ముందు టైటానిక్‌ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

వందేళ్ల కిందట అట్లాంటిక్‌(Atlantic Ocean) మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ నౌక(Titanic) శకలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగురు జలసమాధి అయ్యారు. తీవ్రమైన ఒత్తిడి(Pressure) కారణంగా టైటాన్ సబ్‌మెర్సిబుల్‌(Titan Submersible) పేలిపోవడంతో ఆ సాహసికులు మృతి చెందారు. రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికల్‌(Remote controlled vehicle) సాయంతో మినీ జలంతర్గామి(Submarine) శకలాలను గుర్తించామని అమెరికన్‌ కోస్ట్‌గార్డ్‌(american Cost Guard) తెలిపింది.

టైటానిక్‌ నౌక మునిగిపోయిన ప్రదేశానికి వెళ్లడమే ఓ సాహసం.. ఎందుకంటే అది ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశం.. ఈ మాటన్నది టైటానిక్‌ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేక సార్లు సందర్శించిన దిగ్దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌(James Cameron). అవతార్‌(Avatar) వంటి భారీ చిత్రాలను తీసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న జేమ్స్‌ కామెరూన్‌ అంతకు ముందు టైటానిక్‌ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నౌక ప్రమాదానికి ఎలా గురయ్యిందో, సముద్రంలో నిట్టనిలువునా ఎలా మునిగిపోయిందో కళ్లకు కట్టినట్లు చూపించారు కామెరూన్‌.. ఈ సినిమా చిత్రీకరణకు ముందు సముద్రగర్భంలో 13వేల అడుగుల లోతున ఉన్న టైటానిక్ శిథిలాలను కామెరూన్ ఇప్పటికే 33 సార్లు సందర్శించాడు. దశాబ్దం కిందట ఆ అనుభవాలను అందరితో పంచుకున్నాడు. మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్లడం అంటే తనకు చాలా చాలా ఇష్టమని, అందుకే టైటానిక్‌ షిప్‌ మునిగిపోయిన ప్రాంతానికి వెళ్లానని కామెరూన్‌ తెలిపాడు.

ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి అని అన్నాడు. ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద ఓడ ప్రమాదాలలో టైటానిక్‌ ఎవరెస్ట్‌ వంటిదని వ్యాఖ్యానించాడు. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలనే కోరికతోనే టైటానిక్‌(Titanic) సినిమాను తీసినట్టు ఆయన చెప్పాడు. అంతే తప్ప ప్రత్యేకంగా దానిని ఒక సినిమాగా తీయాలనే ఉద్దేశం మొదట్లో తనకు లేదని కామెరూన్‌ చెప్పాడు.

టైటానిక్‌ శకలాలను చూసేందుకు తాను సబ్‌మెరిన్‌లో ప్రయాణించానని అన్నాడు. టైటానిక్‌ విషాదాన్ని అద్భుతంగా తెరకెక్కించాలన్న ఉద్దేశంతోనే చాలాసార్లు టైటానిక్‌ మునిగిన ప్రాంతానికి వెళ్లానని తెలిపాడు. టైటాన్‌ జలాంతర్గామి పేలిపోయి అయిదురుగు యాత్రికులు చనిపోయిన విషయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు కామెరూన్‌. ఈ ఘటన తనకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదని చెప్పాడు. ఇదో భయంకరమైన, విషాదాంతంగా భావిస్తున్నానని అన్నారు. ‘

Updated On 23 Jun 2023 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story