కొన్ని సినిమాలు అనివార్య కారణాల వల్ల ఆగిపోతుంటాయి. కొన్నే గొడవల కారణంగా నిలిచిపోతుంటాయి. ఇలాగే బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు టినూ ఆనంద్‌(Tinu Anand) కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో నటితో గొడవ వచ్చి ఈ చిత్రాన్ని నిలిపివేశాడు. కాలియా, షెహన్‌షా వంటి సినిమాలను టినూ ఆనంద్‌ రూపొందించాడు. అనేక తెలుగు సినిమాలలో నటించాడు. 1989లో అమితాబ్‌బచ్చన్‌(Amitabh Bachchan)- మాధురీ దీక్షిత్‌(Madhuri Dixit) కాంబినేషన్‌లో శనఖ్‌(Shanakh) అనే సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు టినూ ఆనంద్‌

కొన్ని సినిమాలు అనివార్య కారణాల వల్ల ఆగిపోతుంటాయి. కొన్నే గొడవల కారణంగా నిలిచిపోతుంటాయి. ఇలాగే బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు టినూ ఆనంద్‌(Tinu Anand) కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో నటితో గొడవ వచ్చి ఈ చిత్రాన్ని నిలిపివేశాడు. కాలియా, షెహన్‌షా వంటి సినిమాలను టినూ ఆనంద్‌ రూపొందించాడు. అనేక తెలుగు సినిమాలలో నటించాడు. 1989లో అమితాబ్‌బచ్చన్‌(Amitabh Bachchan)- మాధురీ దీక్షిత్‌(Madhuri Dixit) కాంబినేషన్‌లో శనఖ్‌(Shanakh) అనే సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు టినూ ఆనంద్‌. అమితాబ్‌-మాధురిలకు అదే మొదటి సినిమా. సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే సినిమా ఆగిపోవడానికి గల కారణాలను సుమారు మూడు దశాబ్దాల తర్వాత టినూ ఆనంద్‌ చెప్పుకొచ్చాడు. ' ఓ సీక్వెన్స్‌లో అమితాబ్‌ బచ్చన్‌ను కొంత మంది రౌడీలు గ్యారేజ్‌లో గొలుసులతో కట్టి బంధిస్తారు. రౌడీల నుంచి హీరోయిన్‌ను కాపాడేందుకు ఆయన ఎంతో శ్రమిస్తారు.

ఈ క్రమంలోనే తనను రక్షించిన హీరోకు కృతజ్ఞత తెలుపుతూ ఆయన అన్ని విధాలుగా దగ్గరవ్వాలని అనుకుంటుంది. కీలకమైన ఆ సన్నివేశాలలో హీరోయిన్‌ను లో దుస్తులతో చూపించాలనుకున్నాను. అదే విషయాన్ని మాధురి దీక్షిత్‌కు చెప్పాను. అందుకు నచ్చిన దుస్తులను తెచ్చుకోవచ్చని కూడా ఆమెతో చెప్పాను. మొదట మాధురి అందుకు ఒప్పుకున్నారు. తీరా షూటింగ్‌ రోజు లో దుస్తులతో యాక్ట్‌ చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో ఆమెతో గొడవ జరిగింది. ఈ సీన్‌ చేయకపోతే ఈ సినిమా నుంచి వెళ్లిపోమని గట్టిగా చెప్పాను. అంతే బ్యాగ్‌ తీసుకుని మాధురి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా ఆ సినిమా ప్రారంభం అయిన ఐదురోజులకే ఆగిపోయింది.' అని టినూ ఆనంద్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన సలార్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన గ్లింప్స్‌ ఆయన డైలాగ్‌లతోనే ప్రారంభం అవుతాయి. ఆదిత్య 369తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన టినూ ఆనంద్‌ చిరంజీవి నటించిన అంజిలో విలన్‌గా కనిపించాడు.

Updated On 8 Sep 2023 1:31 AM GMT
Ehatv

Ehatv

Next Story