సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మొదటి షో నుండి పాజిటివ్ రివ్యూలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మూడు వారాలుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంది. 100 కోట్ల గ్రాస్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు నాని నటించిన దసరా ఫైనల్ కలెక్షన్స్ ను కూడా దాటేసింది. టిల్లు స్క్వేర్ దాదాపు 125 కోట్లు వసూలు చేసినట్లు ప్రొడక్షన్ హౌస్ ధృవీకరించింది. దసరా ఫుల్ రన్ లో 120 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది.

టిల్లు స్క్వేర్ నెక్స్ట్ టార్గెట్.. విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన గీత గోవిందం సినిమా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గీత గోవిందం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 కోట్లు వసూలు చేసింది. గీత గోవింద, టిల్లు స్క్వేర్ 125 కోట్లకు పైగా వసూలు చేసిన పాన్ ఇండియా కవరేజీ లేని సినిమాలు మాత్రమే. హనుమాన్, కార్తికేయ 2 ఈ లిస్టులో చాలా ముందే ఉన్నా.. అవి పాన్ ఇండియా సినిమాలు అని చెప్పొచ్చు. ఏది ఏమైనా టిల్లు స్క్వేర్ ఇటీవల టాలీవుడ్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది.

Updated On 16 April 2024 10:57 PM GMT
Yagnik

Yagnik

Next Story