మాస్‌మహారాజా రవితేజ(Ravi teja) హీరోగా వస్తున్న కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageshwar Rao). ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్(Abhishek Aggawal Arts)పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్(Gayatri Bharadwaj), నుపూర్ సనన్(Nupur Sanan) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ(vamsi) దర్శకత్వం వహిస్తున్నారు.

Tiger Nageshwar Rao Movie First Look
మాస్‌మహారాజా రవితేజ(Ravi teja) హీరోగా వస్తున్న కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageshwar Rao). ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్(Abhishek Aggawal Arts)పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్(Gayatri Bharadwaj), నుపూర్ సనన్(Nupur Sanan) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ(vamsi) దర్శకత్వం వహిస్తున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను(First Look) ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు పాత్రను పరిచయం చేయడానికి వివిధ భాషల నుంచి టాప్ స్టార్లు ముందుకు రావడం విశేషం. రవితేజ క్యారెక్టర్‌ను తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో శివరాజ్ కుమార్, హిందీలో జాన్ అబ్రహం పరిచయం చేస్తారు. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ టైగర్ నాగేశ్వరరావును పరిచయం చేస్తారని మూవీ మేకర్స్ చెప్పారు. ఏడో దశకంలో స్టూవర్ట్‌పురం గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.. ఇందులో రాబిన్ హుడ్ లాంటి దొంగ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించనున్నారు.
