అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపన్‌హైమర్(J. Robert Oppenheimer) జీవితం ఆధారంగా రూపొందించిన
ఓపెన్‌హైమర్(Oppenheimer) జులై 21న విడుదల కానుంది. అంటే మరో మూడు ఇందులో ఓపెన్‌హైమర్ పాత్రను సిలియన్ మర్ఫీ(Cillian Murphy) పోషించారు. క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

Oppenheimer Movie Ticket Price
అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపన్‌హైమర్(J. Robert Oppenheimer) జీవితం ఆధారంగా రూపొందించిన
ఓపెన్‌హైమర్(Oppenheimer) జులై 21న విడుదల కానుంది. అంటే మరో మూడు ఇందులో ఓపెన్‌హైమర్ పాత్రను సిలియన్ మర్ఫీ(Cillian Murphy) పోషించారు. క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో ఒక సినిమా టికెట్ ధర మూడు వందలో అయిదొందలో ఉంటుంది. అంత ధర పెట్టి టికెట్ కొనుక్కోవడానికి మనం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం.
ఫ్యామిలీతోటి సినిమాకు వెళితే జేబుకు చిల్లే! ఈజీగా రెండు వేలు ఖర్చు అవుతుంది. ముంబాయిలో(Mumbai) ఓపెన్‌హైమర్ సినిమా టికెట్ ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాల 2450 రూపాయలు. మరీ ఇంత రేటా? ఇంత ధర పెట్టి ఎవరైనా చూస్తారా? అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆదివారం వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. ముంబాయిలోని పీవీఆర్ ఐమాక్స్‌లో రెక్లైనర్ సీటు కోసం ఈ ధర నిర్ణయించారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి.
దీన్ని బట్టి చూస్తే క్రిస్టోఫర్ క్రేజ్ భారత్‌లో ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కేవలం ముంబాయి నగరంలోనే కాదు, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలలో కూడా ఒక్కో టికెట్ రేటు వెయ్యి రూపాయలకు పైగానే ఉంది. ఓ హాలీవుడ్ సినిమాకు ఇంత క్రేజ్ ఉండటం ఇప్పుడే చూస్తున్నాం. ఉదయం మూడు గంటలకే బెన్‌ఫిట్ షోలు వేస్తున్నారంటే సినిమా పట్ల ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తోంది. ఇప్పటివరకు మన దేశంలో లక్షకు పైగానే టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మూడు రోజులకు ముందే ఈ రేంజ్ లో సినిమాపై క్రేజ్ ఉందంటే.. రిలీజయ్యాక కాస్త పాజిటిక్ టాక్ వస్తే మాత్రం సినిమాను పట్టలేం. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఓపన్ హైమర్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.
