సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత ఓటీటీ (OTT)లోకి అడుగుపెడతాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ఆ డేట్‏ను రీచ్ అవ్వకముందే ఒటీటీలోకి వచ్చేస్తాయి. అయితే ఈవారంలో ఓటీటీల్లోకి మంచి చిత్రాలు, సిరీస్‏లు రాబోతున్నాయి. ఓటీటీల్లోనే కాకుండా థియేటర్లో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చేస్తున్నాయి.

సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత ఓటీటీ (OTT)లోకి అడుగుపెడతాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ఆ డేట్‏ను రీచ్ అవ్వకముందే ఒటీటీలోకి వచ్చేస్తాయి. అయితే ఈవారంలో ఓటీటీల్లోకి మంచి చిత్రాలు, సిరీస్‏లు రాబోతున్నాయి. ఓటీటీల్లోనే కాకుండా థియేటర్లో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఏప్రిల్ 28న ఏజెంట్‏తో అఖిల్ అక్కినేని రాబోతుండగా.. అటు తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్ రాబోతోంది. అయితే ఈ చిత్రంలో తెలుగు వెర్షన్‏లో కూడా రిలీజ్ అవ్వబోతోంది. ఈ వీక్‏లో థియేటర్లలో ఈ రెండు చిత్రాలు ఆడనున్నాయి. ఇక ఓటీటీలోకి సినిమాలు, సిరీస్‏లు రాబోతున్నాయి. జాన్ ములానే: బేబీ అనే ఇంగ్లిషు చిత్రం ఏప్రిల్ 25న ఓటీటీలోకి రాబోతోంది. లవ్ ఆఫ్టర్ మ్యూజిక్ అనే స్పానిష్ సిరీస్ ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఇక ఏప్రిల్ 27న నాని నటించిన దసరా చిత్రం నెట్‏ఫ్లిక్స్‏లో విడుదలకాబోతోంది.

ఇక డిస్నీప్లస్ హాట్ స్టార్‏లో ఏప్రిల్ 27న సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తెలుగులో విడుదల కానుంది. ఏప్రిల్ 28న మరాఠీ మూవీ వేద్ ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‏లో ఏప్రిల్ 27న తమిళ సినిమా పాతు తలా, ఏప్రిల్ 28న ఇంగ్లిషు సిరీస్ సిడాటెల్ విడుదలకానుంది. ఇకపోతే సోనీ లివ్‏లో ఈ నెల 28న తెలుగు డబ్బింగ్ మూవీ తురుముఖమ్ విడుదల కానుంది. జీ5లో ఏప్రిల్ 28న ఒక సిరీస్, ఒక సినిమా విడుదలకానున్నాయి. ఒకే రోజు హిందీ చిత్రం యూటర్న్, తెలుగు సిరీస్ వ్యవస్థ ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే నందితా శ్వేత నటించిన రారా పెనిమిటీ అనే సినిమా థియేటర్లోకి రానుంది. ఇన్ని సిరీస్‏లు, సినిమాలు ఒకేసారి వీకెండ్‏లో రిలీజ్ అవుతుండటంతో ఏది చూడాలో తెలియని పరిస్థితిలో ఉన్నామంటున్నారు పలువురు సినీ ప్రేమికులు.

Updated On 24 April 2023 7:32 AM GMT
Ehatv

Ehatv

Next Story