✕
This Heroine is Top Lawyer : ఈ హీరోయిన్ ఒక పెద్ద లాయర్.. ఎవరో తెలుసుకోవాలని ఉందా.?
By EhatvPublished on 11 April 2023 5:39 AM GMT
ఫిల్మ్ స్టార్స్ చాలా వరకు అంటున్న మాట ఏంటంటే.. డాక్టర్ అవ్వబోయి.. యాక్టరయ్యానని.. ఒకప్పుడు ఆ మాట.. ఇప్పుడలా కాదు.. ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఓ వైపు హీరోయిన్స్‌గా సినిమాలు తీస్తూనే.. మరోవైపు వాళ్లకి ఇష్టమైన చదువులు చదువుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఎప్పుడు స్టార్ డమ్ వస్తుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు.. వాళ్ల టైమ్ నడిచినంతకాలం నడిపించి.. ఆ తర్వాత ఏ బిజినెస్సో.. లేకపోతే జాబో చేసుకుంటున్నారు ఇప్పటి హీరోయిన్లు.

x
Malvika Sharma
-
- ఫిల్మ్ స్టార్స్ చాలా వరకు అంటున్న మాట ఏంటంటే.. డాక్టర్ అవ్వబోయి.. యాక్టరయ్యానని.. ఒకప్పుడు ఆ మాట.. ఇప్పుడలా కాదు.. ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఓ వైపు హీరోయిన్స్‌గా సినిమాలు తీస్తూనే.. మరోవైపు వాళ్లకి ఇష్టమైన చదువులు చదువుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఎప్పుడు స్టార్ డమ్ వస్తుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు.. వాళ్ల టైమ్ నడిచినంతకాలం నడిపించి.. ఆ తర్వాత ఏ బిజినెస్సో.. లేకపోతే జాబో చేసుకుంటున్నారు ఇప్పటి హీరోయిన్లు.
-
- అయితే పెళ్లి సందD సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన స్మైలీ బ్యూటీ శ్రీలీల (Sreeleela). మొదటి సినిమా ఫట్ అయినా.. సెకండ్ సినిమాతో టాలీవుడ్ (Tollywood)లో పాతుకుపోయింది. అయితే అమ్మాయి ఓ వైపు డాక్టర్ కోర్సు చదువుతూనే ఇటు హీరోయిన్గా స్టార్ స్టేటస్ సంపాదించింది. అలా చెప్పుకుంటే సాయిపల్లవి కూడా ఒక డాక్టరే.. అటు ఆ వృత్తి చేసుకుంటూ.. ఇటు నచ్చిన సినిమాలు చేస్తోంది పల్లూ.
-
- ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయి కేవలం హీరోయినే కాదు.. ముంబై హైకోర్టులో అడ్వొకేట్. ముంబైలోని రిజ్వి లా కాలేజీ నుంచి క్రిమినాలజీలో ఎల్ఎల్బీ (LLB) కోర్సు కంప్లీట్ చేసి.. ముంబై బార్ కౌన్సిల్ మెంబర్‌గా ఉంది. ఈ భామను చూస్తే అసలు లాయర్ (Lawyer) లా నే కనిపించదు మనకి. ఎందుకంటే ఆమె తన అందాల ఆరబోతతో ఆ ఆలోచన రాకుండా చేస్తుంది మరి. ఆ అమ్మాయే మాళవిక శర్మ (Malvika Sharma).
-
- టాలీవుడ్లో రెండు సినిమాలు చేసి.. చేతులు కాల్చుకుంది ఈ భామ. ఇక్కడ వర్కౌట్ అయ్యేలా లేదు అని టాటా బైబై చెప్పేసి తమిళం, హిందీ సినిమాలవైపు వెళ్లింది ఈ భామ. 2018లో నేల టికెట్టు సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచమైంది ఈ భామ. రెండేళ్ల గ్యాప్ తీసుకుని 2021లో రెడ్ సినిమాతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ కేరళ కుట్టి.
-
- ముంబైలో పుట్టి పెరిగిన ఈ భామ.. కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని టీవీ యాడ్స్‌లో కనిపించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సమయంలోనే మాళవిక శర్మ (Malvika Sharma)కు టాలీవుడ్లో రవితేజ (Ravi Teja) సరసన నటించే అవకాశం దక్కింది. ఈ భామ 1999 జనవరి 26న ముంబైలోని అంధేరి ఈస్ట్‌లో జన్మించింది. ఈ అందాల భామ ప్రస్తుతం కిసీకా భాయ్.. కిసికీ జాన్ చిత్రంలో నటిస్తోంది.

Ehatv
Next Story