రానున్న సెప్టెంబర్ మాసంలో కృష్ణాష్టమి(Krishna Janmashtami), వినాయకచవితి(Vinayaka chavithi) అనే రెండు ప్రధాన పండుగలు వస్తున్నాయి. ఇక సినీ అభిమానులకు అయితే ఇంకొన్ని పండుగలు కనువిందు చేయబోతున్నాయి. ఎందుకంటే ఈ నెలలో ఏడుకు పైగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

September Month Movies
రానున్న సెప్టెంబర్ మాసంలో కృష్ణాష్టమి(Krishna Janmashtami), వినాయకచవితి(Vinayaka chavithi) అనే రెండు ప్రధాన పండుగలు వస్తున్నాయి. ఇక సినీ అభిమానులకు అయితే ఇంకొన్ని పండుగలు కనువిందు చేయబోతున్నాయి. ఎందుకంటే ఈ నెలలో ఏడుకు పైగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 19వ తేదీ వినాయక చవితి పర్వదిన్నాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 15న ఏకంగా మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)- సమంత(Samantha) జంటగా నటించిన ఖుషి(Kushi) విడుదలవుతోంది. శివ నిర్మాణ దీనికి దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన మజిలీ సినిమా తర్వాత ఖుషి వస్తుండటంతో అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన బాలీవుడ్ మూవీ జవాన్(Jawan) రాబోతున్నది. తమిళ దర్శకుడు అట్లీ(Atlee Kumar), బాలీవుడ్ కింగ్ షారూక్‌ఖాన్(shah rukh khan) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో నయనతార(Nayanthara) బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. మరో ముఖ్య పాత్రను దీపికా పడుకొనే పోషిస్తున్నారు. పఠాన్(Pathaan) తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కాబోతున్నది. అదే రోజున యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty), అనుష్క(Anushka) జంటగా నటించిన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) రిలీజ్ అవుతున్నది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేశ్‌బాబు(Mahesh Babu). పి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 15న రామ్ పోతినేని(Ram Pothineni), శ్రీలీల(Sreeleela) జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద(Skanda) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రామ్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. అదే రోజున చంద్రముఖి 2(Chandramukhi2) రిలీజ్ కాబోతున్నది. రాఘవ లారెన్స్(Raghava Lawrence)-కంగనా రనౌత్(Kangana Ranaut) జంటగా నటించిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించాడు. కీరవాణి సంగీతాన్ని అందించాడు. కోలీవుడ్ హీరో విశాల్(Vishal) నటించిన మార్క్ ఆంథోనీ(Mark Antony) కూడా అదే రోజు విడుదల కాబోతున్నది. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీసిన ఈ సినిమాలో విశాల్‌కు జంటగా రీతూవర్మ నటించారు. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్(Prabhas) సినిమా సలార్(Salaar) సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్నది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతాయి.
