✕
Allu Arjun Rejected 9 Movies : అల్లు అర్జున్ ఆ 9 సినిమాలను రిజెక్ట్ చేయడం వెనుక అసలు కారణం ఇదే.. !
By EhatvPublished on 13 April 2023 1:50 AM GMT
టాలీవుడ్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ (Allu Arjun)ఒకరు. బన్నీ అంటే క్రేజ్ అంతాఇంతా కాదు.. ఓ రేంజ్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రత్యేకంగా చెప్పాలంటే సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా నుంచి బన్నీపై ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. అయితే బన్నీ తన కెరీర్లో చాలా వరకు పాపులర్ సినిమాలను వదులుకున్నాడు. ఈ సినిమాలను అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలేంటి.. ఆయన రిజెక్ట్ చేసిన బ్యూటీఫుల్ మూవీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

x
Allu Arjun
-
- టాలీవుడ్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ (Allu Arjun)ఒకరు. బన్నీ అంటే క్రేజ్ అంతాఇంతా కాదు.. ఓ రేంజ్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రత్యేకంగా చెప్పాలంటే సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా నుంచి బన్నీపై ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. అయితే బన్నీ తన కెరీర్లో చాలా వరకు పాపులర్ సినిమాలను వదులుకున్నాడు. ఈ సినిమాలను అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలేంటి.. ఆయన రిజెక్ట్ చేసిన బ్యూటీఫుల్ మూవీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
-
- బొమ్మరిల్లు (Bommarillu) సినిమాలో నటించేందుకు మొదట అల్లు అర్జున్ (Allu Arjun) ఓకే చెప్పాడన్న సంగతి చాలా మందికి తెలియదు. నిజానికి పరుగు (Parugu) సినిమా కంటే ముందు బన్నీకి దర్శకుడు భాస్కర్ (Bhaskar) ఈ సినిమా ఆఫర్ ఇచ్చాడు. అయితే ఈ దర్శకుడితో క్రియేటివిటిలో విభేదాలు రావడంతో అల్లు అర్జున్ ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. అలా ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ క్యారెక్టర్ సిద్ధార్థ్ (Siddharth)కు వెళ్లింది. ఇక ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమా బ్రాహ్మాండమైన హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా సిద్దార్థ్ కెరీర్లోనే గేమ్ చేంజర్లా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధార్థ్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా నిలిచిపోయాడు.
-
- ఇక తేజ( Teja) దర్శకత్వంలో వచ్చిన జయం (Jayam) సినిమాను కూడా బన్నీ రిజెక్ట్ చేశాడు. ఈ చిత్రం మంచి హిట్‌ను అందుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో నితిన్ (Nithiin) హీరోగా నిలదొక్కుకోవడానికి ఒక మెట్టుగా నిలిచింది. అయితే అల్లు అర్జున్ (Allu Arjun) ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడట. మరోవైపు బన్నీ వేరే ప్రాజెక్టుల్లో బిజీగాఉండటంతో ఆ సినిమాను వదులుకున్నాట్టు చెప్తున్నారు. ఇంకొందరేమో అసలు బన్నీకి ఆ స్క్రిప్ట్ నచ్చకపోవడంతోనే సినిమాను రిజెక్ట్ చేశాడన్నది మరో వాదన.
-
- ఇలా రిజెక్ట్ చేసిన లిస్ట్‌లో మూడో సినిమా రవితేజ (Ravi Teja) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన భద్ర (Bhadra). ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని సాధించి రవితేజ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మెయిన్ యాక్టర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సహాయపడింది. మొదట ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ బోయపాటి శ్రీను అల్లు అర్జున్(Allu Arjun)ను కాంటాక్ట్ అవగా ఆయన రిజెక్ట్ చేశాడట. ఆ సినిమాపై బన్నీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కారణం తెలియదు. కానీ కొంత అనుకున్నద్ది ఏంటంటే బన్నీకి ఆ మూవీ స్క్రిప్ట్ నచ్చలేదట.
-
- సుకుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటించిన 100% లవ్ (100% Love) చిత్రం అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మరో చిత్రం. ఈ సినిమా క్రిటిక్ అండ్ అలాగే కమర్షియల్‌గా విజయం సాధించింది. నాగచైతన్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రధాన నటుడిగా స్థిరపడటానికి సహాయపడింది. అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశం వచ్చినా సరే ఆయన దీన్ని రిజెక్ట్ చేశారు. ఆయన సినిమాను రిజెక్ట్ చేయడానికి గల కారణం మాత్రం తెలియదు.
-
- విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన అర్జున్‌రెడ్డి సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వదులుకున్నాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఇటు కమర్షియల్‌గా కూడా మంచి విజయాన్ని అందుకుని.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ అగ్ర హీరోగా ఎదిగాడు. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కోసం సందీప్ రెడ్డి బన్నీని సంప్రదించడగా ఆయన నేను ఈ సినిమా చేయ్యను అని చెప్పేశారట. ఆ సినిమా చేయకపోవడానికి కారణంపై ఇప్పటికీ క్లారిటీ లేదు.. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో బన్నీ ఆ సినిమాను నేను చేయాల్సింది కానీ దురలేదు అని అన్నాడు.
-
- ఇక 2015లో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మరో సినిమా.. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో రామ్ పోతినేని చేసిన సినిమా పండగ చేస్కో(Pandaga Chesko).ఈ మూవీ కూడా కమర్షియల్‌గా మంచి విజయం సాధించి, తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ పోతినేని హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలా చేసింది ఈ సినిమా. ఈ చిత్రం కోసం మొదటగా గోపిచంద్ మలినేని అల్లు అర్జున్ (Allu Arjun)ను మీట్ అయ్యారట. అయితే కథ మొత్తం విన్నాక.. ఈ సినిమాను నేను చేయడం లేదు అని చెప్పేశాడట. అయితే సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక కారణం ఏంటో తెలియదు అంటున్నారు సినీ ప్రియులు.
-
- విక్రం కుమార్ దర్శకత్వంలో వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ (Nani's Gang Leader) సినిమా బాక్సీఫీసు దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమా ఒక బిలో యావరేజ్‌గా ఆడింది. ఈ చిత్రంతోనే టాలీవుడ్లో నాని హీరోగా ఎస్టాబ్లిష్ అవడానికి దోహదపడిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్(Allu Arjun)కి అవకాశం వచ్చినా సరే వద్దనుకున్నాడట. ఏది ఏమైనా సినిమాను బన్నీ వదులుకోని మంచి పనిచేశాడంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు.
-
- 2020లో రవితేజ హీరోగా వీఐ ఆనంద్ (Vi Anand) దర్శకత్వంలో వచ్చిన డిస్కో రాజా (Disco Raja) సినిమా. ఈ సినిమాను కూడా అల్లు అర్జున్ (Allu Arjun) రిజెక్ట్ చేశాడు. అయితే రవితేజ నటనకు మంచి మార్కులుపడినప్పటికీ.. కమర్షియల్‌గా డిజాస్టర్ అయింది. ఈ సినిమా కూడా అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడం మంచిపని అయిందని ఇటు అభిమానులు, అటు సినీ ప్రేక్షుకులు అంటున్నారు. ఈ సినిమా చేసినట్టయితే బన్నీ ఇమేజ్ కాస్త దెబ్బతినేదంటున్నారు.
-
- ఇక 2018లో విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం పెట్ల (Parasuram Petla) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీత గోవిందం (Geetha Govindam). ఈ చిత్రం అల్లు అర్జున్ (Allu Arjun)కు నిరాశే మిగిల్చింది. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతోపాటు కమర్షియల్‌గా కూడా మంచి హిట్‌ను సాధించింది. దీంతో విజయ్ దేవరకొండ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగాడు. ఈ సినిమాను తిరస్కరించడంతో ఆయనకు కాస్త నిరాశమిగిలినట్టే అయింది. ఈ సినిమాను బన్నీ ఓకే చేసినట్టయితే బావుండేదని అభిమానులు అంటున్నారు. కానీ ఏదమైనా సినిమా హిట్ అవుతుందా.. ఫెయిల్ అవుతుందాని అనేది చూసే ప్రేక్షకుల చేతిలో ఉంటుందని.. కొన్ని సినిమాలు బై లక్‌తో హిట్ అవుతాయని అంటున్నారు కొందరు. బన్నీ చాలా వరకు హిట్అవ్వాల్సిన సినిమాలనే వదులుకున్నట్టు కనిపిస్తోంది అంటున్నారు సినీ ప్రేమికులు.

Ehatv
Next Story