✕
#Oscar winners : ఆస్కార్ గెలుచుకున్న భారతీయ సినిమాలు ఇవే.. !
By EhatvPublished on 13 March 2023 5:40 AM GMT
ఇండియన్ సినిమాలో తెలుగు సినిమా సరికొత్త చరిత్రను సృష్టించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ సొంతం చేసుకుంది.

x
Oscars 2023
-
- ఇండియన్ సినిమాలో తెలుగు సినిమా సరికొత్త చరిత్రను సృష్టించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ సొంతం చేసుకుంది.
-
- ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2022 మార్చి 25న విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది.
-
- అయితే ఇంత సునామీ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకుంది. రీసెంట్గా 95వ ఆస్కార్ అకాడమి అవార్డ్స్‌లో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌ను తెచ్చుకుని ఓ కొత్త అధ్యాయాన్ని రచించింది. ఒక తెలుగు మూవీ ఆస్కార్ నామినేట్ అవడం ఇదే ఫస్ట్‌టైమ్. ఆ అవార్డులు అందుకోవడం కూడా తొలిసారే.
-
- అవార్డు అందుకున్న కీరవాణి, రాజమౌళిని ఉద్దేశిస్తూ ఓ సాంగ్‌ను పాడారు. ఇక ఈ ‘నాటు నాటు’ సాంగ్ తో పాటు మరో నాలుగు పాటలు హాలీవుడ్ పాటలు నామినేట్ అయ్యాయి. అయితే ఈ నాలుగు పాటలను బీట్ చేసి ఆస్కార్ బరిలో తెలుగు పాట నిలిచి.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో న్యూ వేవ్ క్రియేట్ చేసింది.
-
- ఈ కార్యక్రమంలో ఇండియన్ డాక్యుమెంటరీకి ఆస్కార్ దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ ను గెలుచుకుంది. హాలౌట్, హౌ డూ యూ మేజర్ ఏ ఇయర్, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్ పోటీ పడ్డాయి.
-
- ఇక ఇండియాకు గతంలో వచ్చిన ఆస్కార్ల విషయానికి వస్తే.. ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ గా 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకు భాను అథయ్య తొలి ఆస్కార్ అందుకున్నారు.
-
- ‘గాంధీ’ హాలీవుడ్ సినిమా అయినప్పటికీ ఆ చిత్రానికి ఆమె కాస్టూమ్ డిజైనర్‌గా వర్క్ చేయడంతో ఆస్కార్ దక్కింది. ఆ తదనంతరం 1992లో బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు ఆస్కార్ అవార్డును అందించింది ఆకాడమి కమిటీ.
-
- ఆ తర్వాత 81వ ఆస్కార్ కార్యక్రమంలో ‘స్లమ్ డాగ్ మిలియనిర్’కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఏఆర్. రెహమాన్‌కు రెండు అవార్డులు వరించాయి.
-
- అంతేకాకుండా బెస్ట్ సౌండ్ మిక్సింగ్ లో రసూల్ పూకుట్టికి అవార్డు ఒచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో లిరిసిస్ట్ గుల్జార్ ఆస్కార్ తన సొంతం చేసుకున్నారు. ఇక 2019లో ‘పీరియడ్ ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్’కి ఆస్కార్ అవార్డు ఒచ్చింది. ఇప్పుడు 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు ఒచ్చింది.

Ehatv
Next Story