ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలందరిమధ్య స్నేహం ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు వారి అనుబంధం బయటపడుతుంటుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలందరిమధ్య స్నేహం ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు వారి అనుబంధం బయటపడుతుంటుంది. సెలబ్రిటీలు... సినిమా వాళ్లు అయినంత మాత్రానా వారికి కూడా అభిరుచుులు ఉంటాయి కదా. హీరోలయినా.. వారికి మరో హిరో ఫెవరేట్ అయ్యి ఉండొచ్చు. ఫెవరేట్ సినిమాలు కూడా ఉంటాయి. అలాంటి విషయమే ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఆయనకు బాగా నచ్చిన సినిమా ఏదో తెలుసా..?
ప్రభాస్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. అందులో మహేష్ బాబు కూడా ఒకరు. ప్రభాస్ మహేష్ బాబు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే… ప్రభాస్ లాగా మహేష్ బాబు కూడా ఇప్పుడు పాన్ ఇండియాక వెళ్ళబోతున్నాడు. రాజమౌళి స సినిమాతో ప్రభాస్ ను దాటేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక మహేష్ బాబు ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో ప్రభాస్ కి ఒక రెండు సినిమాలంటే చాలా ఇష్టమట.
అవి ఏ సినిమాలు అంటే ఒకటి పోకిరి, రెండు బిజినెస్ మేన్… ఈ రెండు సినిమాలు ప్రభాస్ కు ఆల్ టైం ఫేవరెట్ సినిమాలని ప్రభాస్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఈరెండు సినిమాల్లో హీరో క్యారెక్టర్ లో కాస్త నెగెటీవ్ షేడ్స్ ఉంటాయి. రఫ్ గా మాస్ గా ఉంటారు. ప్రభాస్ కూడా ఇలాంటి పాత్రలు చేశాడు. ఏక్ నిరంజన్, బుజ్జిగాడు లాంటి సినిమాల్లో ప్రభాస్ పాత్రలకు ఇవి కాస్త దగ్గరగా ఉంటాయి. దాంతో ప్రభాస్ కు ఈ సినిమాలంటే ఇష్టం ఉన్నట్టు తెలుస్తుంది. ఉండడం విశేషం… ఇక మొత్తానికైతే మహేష్ బాబు చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధించినప్పటికి ఈ రెండు సినిమాల్లో ఆయన మ్యానరిజమ్స్ కానీ ఆయన చెప్పిన డైలాగులు ఆడియన్స్ ను బాగా నచ్చుతాయి.
అలాగే మహేష్ బాబులో డిఫరెంట్ యాంగిల్ ను ..యాక్టింగ్ లో తన ప్రతిభను కూడా బయటికి తీసిన సినిమాలు ఇవే కావడం విశేషం. ఇక ఈ సినిమాలు మంచి విజయాలుగా మారడమే కాకుండా ఈ సినిమా దర్శకుడు అయిన పూరి జగన్నాధ్ మహేష్ బాబు కెరియర్ లోనే రెండు మంచి సక్సెస్ ఫుల్ సినిమాలను అందించాడనే చెప్పాలి. ఇలా ప్రభాస్ కు మహేష్ సినిమాల్లో ఇవి బాగా నచ్చాయట.