టాలీవుడ్ లో హీరోయిన్స్(Tollywood Heroins) సినిమాలు ప్లాప్ అయితే ..అలాంటి హీరోయిన్స్ కు ఇంతకు ముందు అగ్ర హీరోల, దర్శకుల సినిమాల్లో ఆఫర్లు వచ్చేవి కావు . కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారింది.
పాతొక రోత ..కొత్తొక వింత అంటారు కదా. ఇది అక్షరాల మన హీరోయిన్స్ కి వర్తిస్తుంది. ఎప్పుడు కొత్త అందాలను కోరుకునే తెలుగు ఇండస్ట్రీ(Tollywood Industry)కి అస్సలు నిద్ర పట్టదు... అందుకే ఎప్పుడు కొత్త అందాల కోసం సెర్చింగ్ లోనే ఉంటారు మన దర్శక నిర్మాతలు ...ఒక రకంగా చెప్పాలంటే మన హీరోయిన్స్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక అక్షయ పాత్ర అనే చెప్పుకోవాలి.
టాలీవుడ్ లో హీరోయిన్స్(Tollywood Heroins) సినిమాలు ప్లాప్ అయితే ..అలాంటి హీరోయిన్స్ కు ఇంతకు ముందు అగ్ర హీరోల, దర్శకుల సినిమాల్లో ఆఫర్లు వచ్చేవి కావు . కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారింది. కెరియర్ లో ప్లాప్ లు పలకరించిన.. ఆపర్లకు మాత్రం కొదువ లేదు. హీరోయిన్స్ అందంగా ఉండి దర్శక నిర్మాతలకు నచ్చితే చాలు ... వారి సినిమాలు హిట్టా లేదా పట్టా అని ఎవరు ఆలోచించడం లేదు. కాస్తా వాళ్లు ఇండస్ట్రీలో అనుభవం ఉన్న హీరోయిన్లు అయితే ఇంకా క్రేజీ ఎక్కువగానే ఉంటుంది.
అయితే టాలీవుడ్ ( Tollywood)లో ప్రెజెంట్ హీరోయిన్స్ కొరత బాగా పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే ఇండస్ట్రీ లో కొన్నేళ్లుగా ఉన్న హీరోయిన్లు (Heroins) అయితే ప్రాజెక్ట్స్ బాగానే కొల్లగొడుతున్నారు,. సాయిపల్లవి, రాశికన్న, కృతిశెట్టి, వీళ్లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయిన వరుస ఆపర్ల తో బీజీ ఉంటున్నారు ఈ భామలు . ఉప్పెనతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కృతిశెట్టి ..ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు (Movies)హిట్టు అవ్వలేదు అయిన కృతి తెలుగు, తమిళ భాషల్లో బిజీ బిజీ గా ఉంది. ఇక మరో హీరోయిన్ సాయి పల్లవి కూడా చెప్పుకో దగిన సినిమాలు ఏవి లేకపోయిన ..ఆమె సినిమాల్లో నటిస్తే చాలు అనుకునే డైరెక్టర్లు కూడా ఉన్నారు.. ఆమెకు అంతలా క్రేజీ ఉందన్న మాట. ఇక అనుపమేశ్వర్ సినిమాలు కూడా చెప్పుకోదగినవి ఏవి లేకపోయిన ..అవకాశాల్ని అందిపుచ్చుకుంటునే... కార్తికేయతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఈ హీరోయిన్లను ప్లాప్ లు పలకరించిన ..వీరికి వరుస ఆఫర్లతో అదృష్టం వరిస్తూనే ఉంది. రెమ్యూనరేషన్ (Remuneration)విషయంలో కూడా వీరికి డిమాండ్ బాగానే ఉంటుంది.
అయితే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ (tollywood)ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్(Heroins) కూడా సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా వారి వారి టాలెంట్ (Talent) ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అటు అందం..మరోవైపు యాక్టింగ్ పరంగా ప్రభావం చూపించిన హీరోయిన్స్ కు అయితే తిరుగే లేదని చెప్పుకోవాలి. సినిమా ప్లాప్ లతో సంబందం లేకుండా .. వాళ్లు కెరియర్ లో బిజీగానే ఉంటారు. ఇప్పుడు తెలుగులో నటిస్తున్న సీనియర్ హీరోయిన్లలో సమంత కి ఓ బేబి సినిమా తర్వాత చెప్పుకోదగిన సినిమా అవకాశాలు ఏవి లేవు. అయిన వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ . పుష్పలో వచ్చిన స్పెషల్ సాంగ్ తో మళ్లీ జోరు పెంచింది సమంత శాకుంతలం సినిమాను పూర్తి చేసిన సమంత .. ఇప్పుడు ఖుషీ లో నటిస్తోంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్ లో బిజీ అయినట్టు తెలుస్తోంది.
అనుష్క(Anushka) స్టార్టింగ్ (starting) లో అందం పైన దృష్టి పెట్టిన ..అరుంధతితో తనలోని టాలెంట్(Talent) ను చూపి ప్రూవ్ చేసుకుంది. అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ గా సినిమాలు చేస్తునే ఉంది. బాహుబలి తర్వాత స్పీడ్ తగ్గించిన... నిశ్శబ్ధం సినిమాతో కాస్తా స్పీడ్ పెంచే సమయానికి అది కాస్తా ప్లాప్ అయిన .. డెరెక్టర్స్ అనుష్క కి సినిమా కథలు వినిపించేందుకు క్యూ కడుతూే ఉన్నారు. పుష్ఫ సినిమాతో తన సత్తా చాటిన రష్మిక మందన్న ..ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పరాజయం అయ్యింది. అయిన ఆమెకు ఆపర్లు మాత్రం తగ్గలేదు. హిందీలోనూ , తమిళంలోనూ వరుసగా అవకాశాల్ని అందుకుంటుంది. ఆ తర్వాత సీతారామం తో బిజీ అయిన ఈ హీరోయిన్ వారసుడు సినిమాలో నటించింది. ఇది అంతా సక్సెస్ టాక్ రాకపోయిన ఇప్పుడు పుష్ప 2 కోసం మరోసారి రంగంలోకి దిగేందుకు సన్నద్దమవుతోంది. ఇక మరోవైపు పూజహెగ్డే సక్సెస్ లు తన అకౌంట్ లో వేసుకున్న.. ఈ మధ్య పరాజయాన్ని వేసుకుంది, రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు హిట్ట్ కాకపోయిన .. ఇవేమి ఆమె కేరీర్ పై ప్రభావం చూపలేదు ..ప్రస్తుతం హిందీలో రెండు ప్రాజెక్ట్ లు చేస్తున్నపూజహెగ్డే.. . త్వరలో మహేష్ బాబుతో కలసి నటించనుంది. మరోవైపు కీర్తి సురేష్ మహనటి సినిమా తర్వాత తాను చేసిన సినిమాలు ఏవి సక్సెస్ ను సాధించలేదు కానీ ఇప్పుడు నానీతో కలిసి దసరా లో నటించింది. తర్వాత బోళాశంకర్ లోనూ కీలక రోల్ పోషిస్తుంది. బాలీవుడ్(Bollywood) నుంచి హీరోయిన్లు వస్తున్న సీనియర్ హీరోయిన్లు నుంచి మొదలుకొని , కొత్త తరం హీరోయిన్స్(Heroins) వరకు అందరికీ అవకాశాలు దక్కుతుండడం హీరోయిన్లకి కలిసొస్తున్న కాలం అని చెప్పుకోవాలి.