అక్కినేని(Akkineni) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. అఖిల్ నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఏజంట్(Agent) నుంచి సాలిడ్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్.

అక్కినేని(Akkineni) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. అఖిల్ నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఏజంట్(Agent) నుంచి సాలిడ్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్.

అక్కినేని అఖిల్(Akkineni akhil) హీరోగా నటిస్తూ.. సాక్షీ వైద్యా(sakshi Vaidhya).. హీరోయిన్ గా పరిచయం అవుతూ.. తెరకెక్కిన సినిమా ఏజంట్. స్టార్ మేకర్ సురేందర్ రెడ్డి(sundhar reddy) డైరెక్టర్ చేస్తున్న ఈసినిమా ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉందీ ఏజంట్ మూవీ. రిలీజ్ కు డేటు దగ్గర పడుతుండటంతో.. ఏజంట్ మేకర్స్ ప్రమోషన్స్ జోరును పెంచేశారు. అఖిల్ కూడా ఈసారి చాలా మారిపోయాడు. ఏజంట్ సినిమాన సీరియస్ గా తీసుకున్నాడు. ఎలాగైనా సినిమా సక్సెస్ సాధించాలని తపనతో ఉన్నాడు అఖిల్. గతంలో తాను చేసిన సినిమాలన్నీ.. హీరోగా తనను నిలబెట్టక పోవడంతో.. ఈసినిమా కోసం గట్టిగా కష్టపడ్డాడు అఖిల్.

ఇక ప్రమోషన్లలో భాగంగా.. ఏజంట్ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్‌(theatrical trailer) ను రిలీజ్ చేశారు మేకర్. కాకినాడలో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లతో కూడిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. అఖిల్ నటనలో చాలా చేంజ్ వచ్చినట్టు తెలుస్తోంది. రా ఏజంట్ గా అఖిల్ అద్భుతంగా పెర్పామ్ చేశాడు. అంతే కాదు హాలీవుడ్ హీరో మాధిరి బీస్ట్ బాడీతో.. అఖిల్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. అంతే కాదు కొన్ని ఫ్రేమ్స్ లో అఖిల్ చాలా హ్యండ్సమ్ గా కూడా కనిపించాడు. ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ కష్టం అంతా ట్రైలర్ లో కనిపిస్తోంది. అతని సిక్స్ ప్యాక్ ...తో పాటు... యాక్షన్ సీక్వెన్స్ కోసం బాగా.. హార్డ్ వర్క్ చేశాడు అఖిల్. ఇక మమ్ముట్టి పాత్ర కూడా సినిమాకు ఇంపార్టెంట్ అని తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. అఖిల్ లుక్, డైలాగ్స్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ క్యూట్ లవర్ బాయ్ గా ఉన్న అఖిల్.. ఈసినిమాత్ యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకోబోతున్నాడు. దాని కోసం అఖిల్ ఎంతగానో మేకోవర్ అయ్యాడు. ఈమూవీ హిట్ అయితే.. అఖిల్ కెరీర్ రైట్ టర్న్ తీసుకుంటుంది అని అనుకుంటున్నారు అక్కినేని అభిమానులు.

ఇక ఇతర ప్రమోషన్ ఈవెంట్స్ ను కూడా అఖిల్ డిఫరెంట్ గా చేస్తున్నాడు,. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లాంచ్ సందర్భంగా అఖిల్ అద్బుతమైన ఫీట్ చేశాడు. 172 అడుగుల ఎత్తు ఉండే PVP బిల్డింగ్ నుంచి రోప్ సహాయంతో ఏజెంట్ మోడ్ లో అఖిల్ డైవ్ చేస్తూ కిందకు దిగాడు. ఈ ఫీట్ కు ఫిదా అయ్యారు అక్కినేని ఫ్యాన్స్.. ఈవీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక ట్రైలర్ తో మరో మెట్టు ఎక్కిన అఖిల్.. సినిమాతో తనను తాను ఫ్రూ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

Updated On 19 April 2023 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story