బిచ్చగాడు (Bichagadu) చిత్రం విడుదలై ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. అటు సమ్మర్లో బ్రహ్మోత్సవం చిత్రం డిజాస్టర్ అవడంతో.. విజయ్ ఆంటోనీ (Vijay Antony) చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే బిచ్చగాడు సినిమాకు సీక్వెల్గా వస్తున్న బిచ్చగాడు 2 (Bichagadu2) సినిమా భారీ వసూళ్లను రాబట్టేలా ఉందని తెలుస్తోంది.
బిచ్చగాడు (Bichagadu) చిత్రం విడుదలై ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. అటు సమ్మర్లో బ్రహ్మోత్సవం చిత్రం డిజాస్టర్ అవడంతో.. విజయ్ ఆంటోనీ (Vijay Antony) చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే బిచ్చగాడు సినిమాకు సీక్వెల్గా వస్తున్న బిచ్చగాడు 2 (Bichagadu2) సినిమా భారీ వసూళ్లను రాబట్టేలా ఉందని తెలుస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి దాదాపు 6 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 7 కోట్ల రూపాయల షేర్ రావాల్సి ఉంది. తెలుగులో విజయ్ ఆందోనీ ట్రాక్ రికార్డు చెప్పుకునేందతగా ఏమీ లేదు. ఒక్క బిచ్చగాడు సినిమా తప్పించి మిగతా ఆయన నటించిన సినిమా కూడా హిట్ కాలేదు. బయ్యర్లు ఈ సినిమాను నమ్మడం వెనుక ఏదో మంచి రీజనే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
గత రెండు మూడు వారాలుగా తెలుగు బాక్సాఫీసు దగ్గర సక్సెస్రేట్ ఉన్న సినిమాలేవి లేవు. ఏజెంట్ (Agent) నుంచి మొదలు పెడితే కస్టడీ (Custody) వరకు ప్రతీ సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తాపడ్డవే. ది కేరళ స్టోరీ (The Kerala Story) సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అంతగా హైప్ తీసురాలేకపోయింది. అయితే అన్ని మంచి శకునములే (Anni Manchi Sakunamule) చిత్రం ఈ నెల 18న థియేటర్లలోకి రాబోతోంది కానీ ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలి సినిమా కాబట్టి ఈ వీకెండ్లో బిచ్చగాడు 2 (Bichagadu2) చిత్రానికి కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయని.. ఇది సేఫ్ బెట్ అని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. కానీ ఈ సారి నిర్మాత, డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) అవడంతో.. ఈ ఎమోషనల్ డ్రామాను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఆయన నటించిన బిచ్చగాడు (Bichagadu) సినిమా తర్వాత మరేసినిమా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి.. ఇప్పుడు విడుదలయ్యే బిచ్చగాడు 2 మంచి కలెక్షన్లు తెచ్చుకుంటుందో లేదో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే మరి.