పది రోజుల పాటు థియేటర్లు బంద్ చేయాలని

ఎన్నికల కారణంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లో పెద్ద సినిమాలు విడుదలవ్వలేదు. పెద్ద సినిమా నిర్మాతలు తమ సినిమాల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ ల కారణంగా థియేటర్లు బోసిపోయాయి. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు భారీ నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో షోకు పది, పదిహేను మంది మాత్రమే వస్తున్నారని, టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ము కరెంట్ బిల్లుకే సరిపోవడంలేదని తెలుస్తోంది. తక్కువ మంది ప్రేక్షకుల కోసం షో వేయలేమని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ థియేటర్లను పది రోజుల పాటు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.

పది రోజుల పాటు థియేటర్లు బంద్ చేయాలని తెలంగాణ రాష్ట్ర సింగిల్ థియేటర్ అసోసియేషన్ నిర్ణయించిందని కథనాలు వచ్చాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మే 25 నుంచి సినిమాల జోరు ప్రారంభమవుతుంది. “లవ్ మి,” “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,” “హరోమ్ హర,” “సత్యభామ” వంటి చిత్రాలు మే చివరి వారాల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి.

Updated On 15 May 2024 1:07 AM GMT
Yagnik

Yagnik

Next Story