టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ మార్క్ సాధించాడు విశ్వక్ సేన్. మాస్ క్లాస్ తో పాటు..యూత్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకన్నాడు యంగ్ అండ్ డైనమిక్ హీరో. వివాదాల మధ్య ఎక్కువగా నలుగుతున్న ఈ కుర్ర హీరో.. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఏమాత్రం వెనకడుకు వేయడు. రీసెంట్ గా దాస్ కా దమ్కీ(Das Ka Dhamki) సినిమాతో ఓ మోస్తరు విజయం సాధించిన ఈ హీరో.. తాజాగా మరో ప్రాజెక్ట్ ను సెట్స్ ఎక్కించాడు.

హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen). ఇప్పటికే పదిసినిమాలకు పైగా చేసిన యంగ్ హీరో.. తన పదకొండో సినిమాకు సబందించిన అప్ డేట్ ను అందించారు.

టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ మార్క్ సాధించాడు విశ్వక్ సేన్. మాస్ క్లాస్ తో పాటు..యూత్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకన్నాడు యంగ్ అండ్ డైనమిక్ హీరో. వివాదాల మధ్య ఎక్కువగా నలుగుతున్న ఈ కుర్ర హీరో.. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఏమాత్రం వెనకడుకు వేయడు. రీసెంట్ గా దాస్ కా దమ్కీ(Das Ka Dhamki) సినిమాతో ఓ మోస్తరు విజయం సాధించిన ఈ హీరో.. తాజాగా మరో ప్రాజెక్ట్ ను సెట్స్ ఎక్కించాడు. కెరీర్ లో తన 11వ సినిమా చేయబోతున్నాడు శివ్వక్ సేన్. ఈమధ్య ఎక్కువగా కాంట్రవర్సిలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న ఈ యంగ్ స్టార్... గెలుపోటములు సమానంగా ఫేస్ చేస్తూ వస్తున్న విశ్వక్ సేన్.. తాజాగా మరో సినిమాను సెట్స్ ఎక్కించాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతంది కాని.. ఇంతవరకూ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు టీమ్. త్వరలో టైటిల్ ఖరారు చేస్తారు . ఈ నెల 31వ తేదీన ఉదయం 10:19 నిమిషాలకు టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు. అదే సమయంలో ఫస్టు గ్లింప్స్(First Glimpse) ను కూడా రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. ఈ పోస్టర్ పై చెవి పోగుతో .. పూల చొక్కాతో .. దమ్ముకొడుతూ మాస్ లుక్ తో విష్వక్ కనిపిస్తున్నాడు.

ఇంత వరకూ విశ్వక్ సేన్ మాస్ యాక్టింగ్ చూపించాడు కాని..మాస్ లుక్ లో మాత్రం కనిపించలేదు. ఈసారిమాస్ యాక్టింగ్ తో పాటు..మాస్ లుక్ లో జీవించబోతున్నట్టు తెలుస్తోంది. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Updated On 29 July 2023 7:47 AM GMT
Ehatv

Ehatv

Next Story