మహానటి(Mahanati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కీర్తి సురేశ్(Keerthy Suresh). ఆ సినిమాతోనే నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు కీర్తి ఒక్క తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ సినిమాల్లోనూ బిజీ ఆర్టిస్టు. తమిళంలో అరడజను సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయి.

Keerthy Suresh
మహానటి(Mahanati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కీర్తి సురేశ్(Keerthy Suresh). ఆ సినిమాతోనే నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు కీర్తి ఒక్క తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ సినిమాల్లోనూ బిజీ ఆర్టిస్టు. తమిళంలో అరడజను సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయి. ఇందులో ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) సరసన మారి సెల్వరాజ్(selvaraj) దర్శకత్వంలో నటించిన మామన్నన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగు జయం రవితో నటిస్తున్న సైరన్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఇక లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం రివాల్వర్ రిటా(Revolver Rita) చిత్రం, రఘు తాత(Raghu thatha) చిత్రాలలో కూడా కీర్తి నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన దసరా సినిమాలో డిగ్లామర్ రోల్‌లో నటించి మెప్పించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు కీర్తి సురేశ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నదన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన పేరు పర్హాన బీన్ లియాకత్(Parhana Bin Liaquat) అని, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి అని సమాచారం. ఇటీవల అతని పుట్టినరోజు సందర్భంగా నటి కీర్తిసురేశ్ అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకం కదా! అందుకే ఔ వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను వైరల్ చేస్తూ ఈయనేనా కీర్తి సురేష్ కాబోయే వరుడు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
