పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా.. బాలీవుడ్ సీనియరా్ బ్యూటీ దీపికా పదుకునే(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తున్న సినిమా సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్‌ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ మూవీని మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఉండబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు.

హైదరాబాద్ లో లాండ్ అయిపోయారు ప్రభాస్(Prabhas) కల్కీ టీమ్(Kalki Team). ఇక నుంచి ఇక్కడ కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..?

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా.. బాలీవుడ్ సీనియరా్ బ్యూటీ దీపికా పదుకునే(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తున్న సినిమా సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్‌ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ మూవీని మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఉండబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

కల్కీ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో(Hyderabad) ఇప్పటికే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి నుంచే ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యిందట. ఈ నెల అంతా ఇక్కడే షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఆగస్టు 28 వరకు మోయిన్ కాస్ట్ తో సన్నివేశాలు షూటింగ్ చేస్తారట టీమ్. ఫస్ట్ లుక్ పోస్టర్ కు.. ఫస్ట్ గ్లి్మ్స్ కు వచ్చిన రెస్పాన్స్ ను టాలీ చేసుకుని.. సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట నాగ్‌ అశ్విన్‌ టీం. ఇప్పటికే సినిమాలో కీ రోల్‌ పోషిస్తున్న రైడర్లు బ్లాక్‌ కాస్ట్యూమ్స్‌లో కవచం ధరించి ఆయుధాలతో కనిపిస్తూ.. కల్కి 2898 ఏడీపై అంచనాలు పెంచేస్తున్నారు. కల్కి 2898 ఏడీ నుంచి మేకర్స్ విడుదల చేసిన దీపికా పదుకొనే, ప్రభాస్‌ హ్యాండ్‌ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కల్కి 2898 ఏడీ లో ప్రభాస్ తో పాటు ఇండియన్ దిగ్గజ నటులు కలిసి నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్‌ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్‌ (యూనిఫార్మ్‌డ్‌ విలన్‌ ఆర్మీ) కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తుంది. ఇక ఈసినిమాను 2024 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

Updated On 8 Aug 2023 6:06 AM GMT
Ehatv

Ehatv

Next Story