విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda), సమంత(Samantha) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ఖుషి(Kushi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మూవీ మేకర్స్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల(Trailer Release) తేదీని ప్కటించారు. ఈ నెల 9వ తేదీన ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.

విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda), సమంత(Samantha) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ఖుషి(Kushi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మూవీ మేకర్స్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల(Trailer Release) తేదీని ప్కటించారు. ఈ నెల 9వ తేదీన ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమా పాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, సోషల్‌మీడియాలో వ్యూస్‌పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని దర్శకుడు అన్నాడు. ట్రైలర్‌ కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందనే నమ్మకం ఉందని చెప్పాడు. హృద్యమైన ప్రేమకథా చిత్రంగా అందరిని ఆకట్టుకుంటుందని, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని శివ నిర్వాణ అన్నారు. ఖుషి ట్రైలర్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై విజయ్‌ దేవరకొండ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జయరాం, సచిన్‌ఖేడేకర్‌, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ అందిస్తున్నారు.

Updated On 8 Aug 2023 6:45 AM GMT
Ehatv

Ehatv

Next Story