వాల్తేర్‌ వీరయ్య(valther veeraiah) సినిమా సూపర్‌డూపర్‌ హిట్టవ్వడంతో మెగా స్టార్‌ చిరంజీవిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఫ్యాన్స్‌లో జోష్‌ పెరిగింది. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్‌ సినిమాలో నటిస్తున్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు.

వాల్తేర్‌ వీరయ్య(valther veeraiah) సినిమా సూపర్‌డూపర్‌ హిట్టవ్వడంతో మెగా స్టార్‌ చిరంజీవిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఫ్యాన్స్‌లో జోష్‌ పెరిగింది. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్‌ సినిమాలో నటిస్తున్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి సరసన తమన్నా(Tamannaah) హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్‌(Keerthy Suresh) నటిస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి అనిల్‌ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతాన్ని మహతి స్వరసాగర్‌ అందిస్తున్నారు.

పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్‌(Switzerland)వెళ్లినట్టు ఈ మధ్యే సోషల్‌ మీడియా ద్వారా చిరంజీవి తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని అందమైన లోకేషన్స్‌లో తమన్నాతో కలిసి పాటల చిత్రీకరణ జరుగుతున్నట్టు చిరంజీవి తెలిపారు. తాజాగా ‘భోళా శంకర్‌’ మ్యూజిక్‌ మేనియా మొదలుపెడుతున్నామంటూ చిత్ర యూనిట్‌ తెలిపింది. చిరంజీవి సినిమాల్లో పాటలకు, డ్యాన్సులకు ఎంత ఇంపార్టెన్స్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భోళా శంకర్‌లోనూ అదే స్థాయిలో పాటలు ఉంటాయంటున్నారు మేకర్స్‌. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల అవుతుంది.

Updated On 31 May 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story