ఒకప్పుడు హరికథలు, బుర్రకథలు, నాటకాలు, తోలుబొమ్మలాటలు ప్రజలకు ప్రధాన వినోద సాధనాలు. సినిమా వచ్చిన తర్వాత అదే వినోదమయ్యింది. మూవీలను ముచ్చటపడి చూశాడు. టాకీలను ఆశ్చర్యంగా చూశాడు. బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా కలర్ సినిమా అయినా జనాలకు ఫుల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చింది. అప్పట్లో సినిమాలు(Movies) శతదినోత్సవాలు, సిల్వర్‌జూబ్లీలు(Silver Jubilees), గోల్డెన్ జూబ్లీలు(Golden Jubliees) జరుపుకునేవి.
ఒకప్పుడు హరికథలు, బుర్రకథలు, నాటకాలు, తోలుబొమ్మలాటలు ప్రజలకు ప్రధాన వినోద సాధనాలు. సినిమా వచ్చిన తర్వాత అదే వినోదమయ్యింది. మూవీలను ముచ్చటపడి చూశాడు. టాకీలను ఆశ్చర్యంగా చూశాడు. బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా కలర్ సినిమా అయినా జనాలకు ఫుల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చింది. అప్పట్లో సినిమాలు(Movies) శతదినోత్సవాలు, సిల్వర్‌జూబ్లీలు(Silver Jubilees), గోల్డెన్ జూబ్లీలు(Golden Jubliees) జరుపుకునేవి. ఇప్పుడు ఎంత పెద్ద తోపు సినిమా అయినా మాగ్జిమమ్ మూడు వారాలు ఆడుతున్నదంతే! సరే టాకీలు పుట్టినప్పట్నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాను ఎక్కువ మంది చూశారన్నదానిపై లెక్కలు తీశారు. మీరు ఏ సినిమాను ఎక్కువ మంది చూశారనుకుంటున్నారు? బాహుబలి(Bahubali)... నో... బాహుబలి 2(Bahubali 2)... ఇది కూడా కాదు.. మరి ఆర్‌ఆర్‌ఆర్(RRR).. అంతకంటే కాదు.. కేజీఎఫ్, దంగల్.. ఇవి అసలే కావు.. మరి ఏ సినిమా అంటే.. ధర్మేంద్ర(Dharmendra), అమితాబ్‌బచ్చన్(Amitabh Bachchan), సంజీవ్‌కుమార్(sanjeev Kumar), అమ్జాద్ ఖాన్(Amjad Khan), హేమామాలిని(Hema Malini), జయబాధురి(Jayabadhuri) నటించిన షోలే(Showlay)! ఈ సినిమా అప్పట్లో సంచలనం.. ఆ మాటకొస్తే ఇప్పటి వరకు షోలేను మించిన సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. రమేశ్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1975లో విడుదలయ్యింది.
అగస్టు 14న బొంబాయ్ మినర్వా థియేటర్‌లో ప్రీమియర్ షో వేశారు. చూసిన వాళ్లంతా బాగుందన్నారు. మరుసటి రోజు సినిమా విడుదలైంది. మొదటి రెండు వారాలు పెద్దగా స్పందన లేదు. దర్శకుడు రమేష్ సిప్పీకైతే ఏం చేయాలో తెలియని పరిస్థితి. చివరికి అమితాబ్‌ను బతికించి సినిమాను సుఖాంతం చేద్దామనే ఆలోచన కూడా వచ్చింది. రచయితలు సలీం జావెద్‌లకు మాత్రం ఇది ఎంత మాత్రమూ ఇష్టం లేదు. మూడో వారానికి కానీ రమేష్‌కు జరుగుతుందేమిటో అర్థం కాలేదు... చూసిన వాళ్లంతా గంభీరంగా, నిశ్శబ్దంగా ఇంటికెళుతున్నారు. ఆ నిశ్శబ్దం వెనుక ఏదో తెలియని భావోద్వేగం దాగి వుంది. అది దేశమంతా ఆవరించింది. నాలుగో వారం దాటాక కానీ ప్రేక్షకులు మాట్లాడటం మొదలు పెట్టలేదు. అంతే. ఎక్కడ చూసినా షోలే టాపిక్కే. టికెట్లు దొరక్క ప్రేక్షకులు అల్లాడిపోయే పరిస్థితి.
షోలేని చూడనివాళ్లు. షోలే గురించి కాస్తయిన తెలియని వాళ్లు ఉండరు. మూడున్నర గంటల పాటు ప్రేక్షకులను భావోద్వేగాలతో కూర్చొపెట్టగలగడమనేది ఒక్క ఆ సినిమాకే సాధ్యమైంది. సినిమాలో ఎక్కడా హింస అన్నదే కనబడదు కానీ సినిమా మొత్తం నివురుగప్పిన నిప్పులా కణకణమంటూనే వుంటుంది. అదే ఆ సినిమా స్పెషాలిటీ. అందుకే అంత పెద్ద హిట్టయింది. ఇండియన్ మూవీస్‌పైన ఎవరైనా చరిత్ర రాస్తే అందులో ఎక్కువ పేజీలు షోలేకే కేటాయించాల్సి వుంటుంది. షోలేకు అంత పెద్ద చరిత్ర వుంది.
ఇప్పుడు రికార్డు విషయానికి వద్దాం.. ఈ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రం అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా దేశంలోనే నంబర్‌వన్ పొజిషన్‌లో నిలిచింది. ఈ రికార్డును దశాబ్ద కాలంపాటు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు. షోలే తొలిసారి రిలీజైనప్పుడు, అలాగే రీ రిలీజ్ అయినప్పుడు మొత్తంగా భారత్‌లో 15-18 కోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ప్రజలు ఎగబడి చూశారీ సినిమాను. ఒక్క రష్యాలోనే 6 కోట్ల టికెట్లు కొనేశారు. ఇతర దేశాలలో తక్కువలో తక్కువ రెండు కోట్ల వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా 22 నుంచి 26 కోట్ల వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలో ఇదో రికార్డు. అప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే దాని విలువ సుమారు 2,800 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. కేవలం భారత్‌లో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల విషయానికి వస్తే.. షోలే 15 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. బాహుబలి -2 సినిమా 12 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొఘల్ ఏ ఆజమ్, మదర్ ఇండియా సినిమాలకు పది కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. హమ్ ఆప్‌కే హై కోన్ సినిమా 7.4 కోట్లతో అయిదో స్థానంలో ఉంటే, ముఖద్దర్ కా సికిందర్ 6.7 కోట్లతో ఆరో స్థానంలో ఉంది. అమర్ అక్బర్ ఆంథోని 6.2 కోట్లు, క్రాంతి 6 కోట్లు, బాబీ 5.3 కోట్లు, గంగా జమున 5.2 కోట్లతో తర్వాతి స్థానాలలో ఉన్నాయి. ఇక గదర్, కేజీఎఫ్ చాప్టర్ 2, సంగం సినిమాలకు అయిదు కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.