బాలయ్య ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఆయన కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు.. అభిమానులు. టాలీవుడ్‌ సీనియర్ హీరో... కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం NBK 108 తో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi)డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

యంగ్ స్టార్స్ ను పక్కకు కెట్టి యమా స్పీడ్ తో దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. వరుస సక్సెస్ లు కూడా ఆయనకు దాసోహం అంటున్నాయి. దాంతో ఆయన ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్ అవుతున్నారు అంతే.. కాదు.. ఓ రికార్డ్ కోసం ప్రయోగం చేయబోతున్నారు.

బాలయ్య ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఆయన కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు.. అభిమానులు. టాలీవుడ్‌ సీనియర్ హీరో... కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం NBK 108 తో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi)డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈమూవీపై అంచనాలు భారీగా ఉన్నాయిన ఈసినిమా హిట్ అయితే.. బాలయ్య హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుంది. ఈక్రమంలో ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

ఎన్‌బీకే 108 పవర్‌ ఫుల్ టైటిల్‌ను జూన్‌ 8న లాంఛ్ చేస్తున్నట్టు అనిల్ రావిపూడి టీం ఇప్పటికే అప్‌డేట్ ఇచ్చేసింది. తాజాగా ఎన్‌బీకే 108 టీం అభిమానులకు మరో క్రేజీ న్యూస్ అందించింది. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌కు తగ్గట్టుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 108 హోర్డింగ్స్‌తో టైటిల్‌ లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. అంటే బాలయ్య 108వ సినిమాకు 108 టైటిల్ హోర్డింగ్స్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

ఈన్యూస్ బాలయ్య అభిమానుల్లో జోష్ నింపింది. ఈ వార్త తెలిసి వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఇక ఈసినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal) నటిస్తుండగా.. పెళ్లి సందడి ఫేం శ్రీలీల (Sreeleela) బాలయ్య మేనకోడలి పాత్రలో నటిస్తోంది. ఇక తమిళ స్టార్ సీనియర్ హీర్ శరత్‌కుమార్‌ బాలయ్య ప్రణస్నేహితుడిగాకనిపించబోతున్నారట.

ఇప్పటివరకు రాయలసీయ యాసలో అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన బాలయ్య.. తాజా ప్రాజెక్ట్‌లో తెలంగాణ యాసలో సరికొత్త వినోదాన్ని అందించబోతున్నాడని చెప్పాడు అనిల్ రావిపూడి.ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్‌ బంప్స్‌ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించిన ఎస్‌ థమన్‌ మరోసారి సంగీతం అందించేందుకు రెడీ అవుతున్నాడు.

Updated On 8 Jun 2023 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story