ఆయన పవర్‌ ఫుల్‌ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు(bangalore) వెళ్లి పోతున్నట్లు విజయలక్ష‍్మి పేర్కొన్నారు. సీమాన్‌ పవర్‌ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని, రాజకీయంగా విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్‌ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని విజయలక్ష్మి స్పష్టం చేశారు.

నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌(seeman)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడమే కాకుండా అతడి కారణంగా ఏడుసార్లు అబార్షన్‌(abortion) అయ్యిందంటూ నటి విజయలక్ష్మి (vijayalaxmi)పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే కదా! విజయలక్ష్మి చేసిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే రియాక్టయ్యారు. దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె సడన్‌గా సీమాన్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు.తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సీమాన్‌ సంబంధం పెట్టుకుని మోసం చేశాడని విజయలక్ష్మి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు వలసరవక్కం పోలీసులు(valasaravakkam police) 2011లో కేసు నమోదు చేశారు. అయితే, తర్వాత ఆమె మాట మార్చారు. ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి (veeralaxmi)పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష‍్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్‌ సూపర్‌ అని.. ఆయన పవర్‌ ఫుల్‌ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు(bangalore) వెళ్లి పోతున్నట్లు విజయలక్ష‍్మి పేర్కొన్నారు. సీమాన్‌ పవర్‌ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని, రాజకీయంగా విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్‌ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని విజయలక్ష్మి స్పష్టం చేశారు.
దీంతో మద్రాస్‌ హైకోర్టు (madras highcourt)నటి విజయలక్ష్మిని ఈ నెల 29న హాజరుకావాలని ఆదేశించింది.సీమాన్‌, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ (petition)దాఖలు చేశారు. 2011లో దాఖలు చేసిన ఫిర్యాదును 2012లో ఉపసంహరించుకోవాలని నటి విజయలక్ష్మి ఇచ్చిన లేఖ ఆధారంగా పోలీసులు కేసును క్లోజ్‌ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కేసు విచారణ చేపట్టి సమన్లు జారీ చేశారు. 12 ఏళ్ల నాటి కేసులో ఫిర్యాదుదారుల తర్వాత రాజకీయ ఉద్దేశంతో కేసును మళ్లీ తెరుస్తున్నందున కేసు దర్యాప్తుపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చినప్పుడు 2011లో నటి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పుడు కేసు ఎందుకు పెండింగ్‌లో ఉంచారో కూడా సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేష్‌ (justice anand venkatesh)ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. పోలీసు రిపోర్టు (police report)దాఖలైంది. అనంతరం సీమాన్‌ కేసు రద్దుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు నటి విజయలక్ష్మిని 29న కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణను వాయిదా(adjornment)వేశారు.

Updated On 27 Sep 2023 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story